ప్రొఫెసర్ రామ్‌సింగ్‌కు ఐఎస్ఎస్ఏఆర్ ఫెలోషిప్ అవార్డు
పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం వెటర్నరీ గైనకాలజీ అండ్ అబ్స్టెట్రిక్స్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ లకావత్ రామ్‌సింగ్‌కు ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఎస్ఏఆర్ అసోసియేట్ ఫెలోషిప్-2026 అవార్డు లభించింది.
- పట్నాలో జరిగే సదస్సులో ప్రదానం
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం వెటర్నరీ గైనకాలజీ అండ్ అబ్స్టెట్రిక్స్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ లకావత్ రామ్‌సింగ్‌కు ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఎస్ఏఆర్ అసోసియేట్ ఫెలోషిప్-2026 అవార్డు లభించింది. ఈమేరకు ఐఎస్ఎస్ఏఆర్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం సెల్వరాజు ప్రకటించిన అవార్డును నేడు పాట్నాలోని బీహార్ వెటర్నరీ కాలేజీ నిర్వహించే ఐఎస్ఎస్ఏఆర్ 41వ వార్షిక సదస్సు జాతీయ సమావేశంలో ప్రదానం చేయనున్నారు.
పశువుల పునరుత్పత్తి శాస్త్రరంగంలో ఆయన అందిస్తున్న విశిష్టసేవలు, పరిశోధనలు, విద్యారంగంలో చేసిన కృషికి గుర్తింపుగా జాతీయస్థాయి పురస్కారం దక్కింది. ప్రస్తుతం రామ్‌సింగ్ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పశువైద్య కళాశాలలో వెటర్నరీ గైనకాలజీ అండ్ అబ్స్టెట్రిక్స్ విభాగంలో డీన్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

