తండ్రీకూతుళ్ల అనుబంధానికి దర్పణం
“నాన్న కుట్టి’ సినిమా బాగా వచ్చింది. ప్రథమార్ధం సరదాగా సాగుతుంది. ద్వితీయార్ధం భావోద్వేగపూరితంగా ఉంటుంది.
“నాన్న కుట్టి’ సినిమా బాగా వచ్చింది. ప్రథమార్ధం సరదాగా సాగుతుంది. ద్వితీయార్ధం భావోద్వేగపూరితంగా ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా లిథాన్య పాత్రతో అంతా కనెక్టవుతారు. ఇది అందరికీ నచ్చే సినిమా’ అని హీరో విజయ్ ఆంటోని అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘నాన్న కుట్టి’. ప్రీతి అస్రానీ కథానాయిక. ము.మారన్ దర్శకుడు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై మీరా విజయ్ ఆటోని సమర్పణలో ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం ఈనెల 27న విడుదల కానున్నది.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విజయ్ ఆంటోని మాట్లాడారు. తండ్రీకూతుళ్ల అనుబంధమే ఈ సినిమాకు ప్రధాన బలమని, మంచి కంటెంట్‌తో రానున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని దర్శకుడు ము.మారన్ తెలిపారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు. తండ్రీకూతుళ్ల భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ ట్రైలర్ ఆద్యంతం సాగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

