chand bali | అందాన్ని రెట్టించడానికి చాంద్‌బాలీ ఆభరణాలు.. వీటిని మించిన ఫ్యాషన్ లేనే లేదు
chand bali jewelery| అందాన్ని పోల్చడానికి చంద్రుడిని మించిన ఉపమానం ఉండదు. అందాన్ని రెట్టించడానికి చాంద్బాలీకి సాటి వచ్చే ఆభరణమూ లేదు. నిండు చందమామను తలపించే పూసలు, రాళ్లు పొదిగిన చాంద్‌బాలీలు ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్.

ఒకటి నుంచి ఐదు వరుసల వరకూ ఉండే చాంద్‌బాలీ నగలు ఈనాటివేం కాదు. మొఘలులు, నిజాముల ఆభరణాల్లో చాంద్‌బాలీల స్థానం ప్రత్యేకం. అతివల అందాన్ని ద్విగుణీకరించే ఆ పెద్దపెద్ద జుంకాలు కదిలినా, మాట్లాడినా వయ్యారంగా ఉయ్యాలలూగుతాయి. సంప్రదాయ వస్ర్తాలపై చాంద్‌బాలీ నగల ఆకర్షణే వేరు. చీర, గాగ్రా, చుడీదార్.. ఇలా ఏ దుస్తులైనా సరే, చాంద్‌బాలీ నగలను అలంకరించుకుంటే అతివ అందం రెట్టింపు అవుతుంది. అన్‌కట్ డైమండ్స్, గుట్టపూసలు, ముత్యాలు, జాతిరత్నాలు, వజ్రాల మేళవింపుతో చూడగానే ఆకర్షిస్తాయి. మెడలో ఏ నగలున్నా లేకున్నా చెవులకు చాంద్‌బాలీ జుంకాలుంటే సరి! ముఖం కోటి వజ్ర కాంతులతో మెరిసిపోతుంది.

హారాలు, కాంబోలు..
చాంద్‌బాలీ అంటే జుంకాలకే పరిమితమైన డిజైన్ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు హారాలు, నెక్లెస్‌లు, మాంగ్టిక్కా (పాపిట బిళ్ల)లూ తయారవుతున్నాయి. ఒకే డిజైన్‌లో తయారై, ఒకే రకమైన రాళ్లు, రత్నాలు పొదిగిన కాంబోలు కూడా అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ దుస్తులకు, నగలకు పెరుగుతున్న ఆదరణతో చాంద్‌బాలీలు మరోసారి ఫ్యాషన్ ప్రపంచంలో తళుక్కుమంటున్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్దాకా రూపొందుతున్న ‘చారిత్రక’ సినిమాల వల్ల వీటికి మరింత క్రేజ్ పెరిగింది. ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, జాన్వీ కపూర్, అదితీరావు హైదరీ వంటి బాలీవుడ్ భామలు చాంద్‌బాలీ జుంకాలను అలంకరించుకోవడంతో ఈ
ఫ్యాషన్‌కు స్టార్ స్టేటస్ వచ్చింది.

రామ్‌లీలా చాంద్‌బాలీ
చందమామ అందానికి సంప్రదాయాన్ని మేళవిస్తూ.. లక్ష్మీదేవి, వినాయకుడు, రామపరివారం ప్రతిరూపాలను పొదిగిన జుంకాలు, హారాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. వీటిని రామ్‌లీలా చాంద్‌బాలీ డిజైన్ అంటారు. జుంకీబాలీ, పోల్కీ, కుందన్కారీ, మీనాకారీ డిజైన్లలోనూ తయారవుతున్నాయి. మయూరాలు, గజరాజులు కూడా చాంద్బాలీల్లో ఒదిగిపోయి మరింత అందంగా మెరిసిపోతున్నాయి. అచ్చంగా బంగారంతోనే కాకుండా ఇతర లోహాలతో
చేసినవీ మార్కెట్లో లభిస్తున్నాయి. త్రెడ్, ఫ్యాబ్రిక్ జువెలరీలోనూ చాంద్‌బాలీ డిజైన్లను జొప్పిస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Fashion | పట్టుచీరలో.. దీప లక్ష్మి
Hair color | కోరుకున్న రంగు కురులకు హంగు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!









