పారా అథ్లెట్ల విజయ దుందుభి.. తొలిరోజే భారత్ ఖాతాలో 11 మెడల్స్
పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. పోటీల తొలిరోజే 11 పతకాలతో తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పారు. వీటిలో ఏకంగా 4 స్వర్ణాలు ఉండగా ఐదు రజతాలు, 2 కాంస్య పతకాలున్నాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు రికార్డు స్థాయిలో ఆరు మెడల్స్ సాధించారు.
- అందులో నాలుగు స్వర్ణాలు
- శీతల్ ప్రపంచ రికార్డు
- ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో జోరు
దేశవ్యాప్తంగా ప్రజలు దసరా పండుగ జోష్‌లో ఉండగా దేశ సత్తా చాటేందుకు జపాన్‌కు వెళ్లిన మన పారా అథ్లెట్ల బృందం తొలిరోజే పతకాల పండుగను ఘనంగా జరుపుకుంది. ఒకేరోజు భారత్ ఖాతాలో ఏకంగా 11 మెడల్స్ చేరడం గమనార్హం. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మన క్రీడాకారులు ఆరు పతకాలతో అదరగొట్టగా షూటింగ్, జూడోలో రెండేసి మెడల్స్ గెలిచిన భారత్.. స్విమ్మింగ్‌లోనూ మెడల్‌తో తొలిరోజే పతకాల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.
నగోయా (జపాన్) : పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. పోటీల తొలిరోజే 11 పతకాలతో తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పారు. వీటిలో ఏకంగా 4 స్వర్ణాలు ఉండగా ఐదు రజతాలు, 2 కాంస్య పతకాలున్నాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు రికార్డు స్థాయిలో ఆరు మెడల్స్ సాధించారు. లాంగ్ జంపర్ నిషాద్ కుమార్, మిడిల్ డిస్టాన్స్ రన్నర్ సౌమ్య, జావెలిన్ త్రోలో రింకూ హుడా మొదటి రోజే పసిడిని ముద్దాడగా షూటింగ్లో మోనా అగర్వాల్ బంగారు పతకానికి గురిపెట్టింది.
‘మోనా’తో మొదలై..
ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడల మాదిరిగానే పారా ఆసియాడ్‌లోనూ పతక వేటను షూటర్లే ఆరంభించారు. మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ (ఎస్‌హెచ్1) ఫైనల్లో మోనా అగర్వాల్ 250 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం నెగ్గింది. ఆమె భారత్‌కే చెందిన రెండుసార్లు పారాలింపిక్ చాంపియన్ అవని లేఖరాను 0.4 పాయింట్ల తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ కొట్టడం విశేషం.

అవని 249.6 పాయింట్లతో రజతం గెలిచింది. అంతకుముందు మోనా.. క్వాలిఫికేషన్లో 629.1 పాయింట్ల స్కోరుతో టాప్‌లో నిలిచి ప్రధాన పోటీలోనూ దాన్ని నిలబెట్టుకుంది. ఈ స్వర్ణంతో ఆమె 2028 లాస్ ఏంజెల్స్ పారాలింపిక్స్ బెర్తునూ ఖాయం చేసుకుంది.
జుడోకాల పతక పట్టు
పాక్షిక దృష్టిలోపం కలిగిన జుడోకాలు కోకిల రజతం గెలుచుకోగా కపిల్ పర్మల్ బ్రాంజ్ నెగ్గాడు. మహిళల జే2-52 కిలోల కేటగిరీ ఫైనల్లో కోకిల.. కిర్గిస్థాన్‌కు చెందిన ఉలన్బెక్ కిజి చేతిలో ఓడి రజతంతో సంతృప్తి పడింది. గత పారా ఆసియా క్రీడల్లోనూ ఆమె కాంస్యం నెగ్గగా ఇప్పుడు పతకం రంగును మార్చడం విశేషం. అయితే హాంగ్జౌలో సిల్వర్ నెగ్గిన కపిల్ (జే1-70 కిలోలు).. కాంస్య పోరులో 1-0తో అన్హఫ్ రఫీ (ఇండోనేషియా)ని ఓడించి పతకం సాధించాడు. అంతకుముందు సెమీస్‌లో అతడు 0-1తో ఇండోనేషియాకే చెందిన జునైది చేతిలో ఓడినా బ్రాంజ్‌ను ఖాతాలో వేసుకున్నాడు.
స్విమ్మింగ్‌లో రవికి సిల్వర్
పురుషుల వంద మీటర్ల ఫ్రీస్టయిల్ ఎస్13 ఈవెంట్లో భారత పారా స్విమ్మర్ రవి కార్తీక్ బుడిగిన సిల్వర్‌తో సత్తాచాటాడు. ఎస్13 అంటే కూడా పాక్షికంగా దృష్టిలోపం ఉన్న కేటగిరీలో ఉన్నవారే. లక్ష్యాన్ని రవి 56.68 సెకన్లలో పూర్తిచేసి రజతం గెలుచుకున్నాడు.
వీరికి మెడల్స్ ఖాయం
పారా టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్‌లోనూ పలువురు ప్లేయర్లు దేశానికి మరిన్ని పతకాలను ఖాయం చేశారు. టీటీలో భావినా పటేల్, ప్రాచి పాండే, సొనాల్‌బెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సెమీస్ చేరడంతో వీరికి పతకాలు ఖాయమయ్యాయి. బ్యాడ్మింటన్‌లో నితేశ్ కుమార్-తులసిమతి జోడీ సెమీస్‌కు చేరుకుంది.
ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో గోల్డ్ రష్
ఉదయం ఆర్చర్లు పతక వేటను ప్రారంభిస్తే సాయంత్రం ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు పసిడి పంట పండించారు. మెన్స్ లాంగ్ జంప్ టీ47 ఈవెంట్లో నిషాద్ కుమార్ 7.11 మీటర్లు దూకి స్వర్ణం సాధించాడు. గత పారా ఆసియాడ్‌లో హైజంప్‌లో ప్రాతినిథ్యం వహించిన నిషాద్.. ఇప్పుడు లాంగ్ జంప్‌లోనూ బరిలోకి దిగి పసిడి కొల్లగొట్టాడు. హైజంప్‌లో అతడు పారాలింపిక్స్‌లో రెండుసార్లు రజతాలు గెలుచుకోవడం విశేషం. కాగా మంగళవారం జరిగే హైజంప్ పోటీల్లోనూ నిషాద్ పాల్గొననున్నాడు. హిమాచల్‌ప్రదేశ్ ఉనా జిల్లాలోని బదోన్ గ్రామానికి చెందిన అతడు.. ఆరేండ్ల వయసులో ఉండగానే గడ్డికోత యంత్రంలో పడి అతడి కుడి చేతికి గాయమైంది.

మహిళల 1500 మీటర్ల టీ12/టీ13 (పాక్షిక దృష్టిలోపం) ఈవెంట్లో తొలిసారి బరిలోకి దిగిన సౌమ్య.. 5 నిమిషాల 12.39 సెకన్ల (621 పాయింట్లు)లో లక్ష్యాన్ని చేరి స్వర్ణం దక్కించుకుంది. ఇదే ఈవెంట్లో రాధా వెంకటేశ్.. 5 నిమిషాల 30.90 సెకన్లలో (421 పాయింట్లు) గమ్యాన్ని చేరి రెండో స్థానంతో రజతాన్ని గెలిచింది. మహిళల 1500 మీటర్ల టీ11 ఈవెంట్లో రవన్ని వలసనని (5 నిమిషాల 41.85 సెకన్లు) కాంస్యం గెలుచుకుంది. మెన్స్ జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్లో రింకూ హుడా 65.11 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం నెగ్గగా భారత్‌కే చెందిన అజీత్ సింగ్ 65.02 మీటర్లతో వెండి పతకాన్ని ముద్దాడాడు.
శీతల్ ప్రపంచ రికార్డు
యువ భారత సంచలనం శీతల్ దేవీ పారా ఆసియాడ్‌లో తన ప్రయాణాన్ని ప్రపంచ రికార్డుతో ప్రారంభించింది. మహిళల కాంపౌండ్ క్వాలిఫికేషన్లో శీతల్.. 720 పాయింట్లకు గాను ఏకంగా 704 పాయింట్లు స్కోరు చేసింది. గతంలో ఈ రికార్డు (698 పాయింట్లు) తన పేరిటే ఉండేది. వ్యక్తిగతంగానే గాక మిక్స్డ్ విభాగంలో తోమన్తో కలిసి 1,402 పాయింట్ల (పాతది 1,400)తో కొత్త రికార్డు నెలకొల్పింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

