హౌతీ రెబెల్స్ దాడి.. 53 మంది సైనికులు మృతి
ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్‌లోని దక్షిణ ప్రాంతంలో ప్రభుత్వ బలగాల సైనిక శిబిరంపై సోమవారం బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారు.
- యెమెన్‌లో ఘటన
కైరో : ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్‌లోని దక్షిణ ప్రాంతంలో ప్రభుత్వ బలగాల సైనిక శిబిరంపై సోమవారం బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారు. ఈ ఘటనలో కనీసం 53 మంది సైనికులు మరణించగా, మరో 200 మంది శిక్షణ పొందతున్నవారు గాయపడ్డారని షబ్వా ప్రావిన్స్ అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
ఈ దాడి తామే చేసినట్టు హౌతీలు అంగీకరించారు. శిక్షణ, సన్నద్ధత దశలో ఉన్న కొత్త సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగిందని, ఇది షబ్వా ప్రావిన్స్ భద్రత, స్థిరత్వానికి ముప్పు కలిగించే తీవ్రమైన సైనిక ఉద్రిక్తతకు నిదర్శనమని ప్రావిన్స్ ప్రభుత్వం పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

