snatch bun | స్నాచ్ బన్ కొప్పు వేసుకోవడం అంత కష్టమా?

Snatch bun hair style | కేశాలంకరణలో కొప్పు ఎవరికైనా నప్పుతుంది. ఓ ఐదు దశాబ్దాలు వెనక్కి వెళ్తే ఒప్పుల కొప్పుతో ఆనాటి భామలు వయ్యారాలు పోయేవారు. పూర్తిగా కనుమరుగు కాకపోయినా కొప్పుల ట్రెండ్ కొంత మసకబారిందనే చెప్పవచ్చు. మళ్లీ ఈ మధ్య కాలంలో ‘స్నాచ్ బన్’ కొప్పులు ఇంతుల నెత్తిన సొంపులతో ఒప్పారుతున్నాయి. సెలబ్రిటీ పార్టీల్లో ఇద్దరు, ముగ్గురు తప్పనిసరిగా ఈ స్నాచ్ బన్లతో కనిపిస్తున్నారు. పండుగ పూట కొప్పు కొత్త అందాన్ని తీసుకొస్తుంది. అయితే ఇది అందంగా నప్పాలంటే కొంచెం కష్టపడాల్సిందే!
వాలుజడను మూడుసార్లు తిప్పి ముడివేసుకుంటే సరిపోదు. కొప్పు కుదురుగా ఉండాలంటే ఓర్పు చాలా అవసరం. ఇటీవల కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ స్నాచ్ బన్‌తో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. హెయిర్ స్టయిలిస్ట్ నమ్రతా సోనీ ఈ విషయంపై పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. ‘ఈ స్నాచ్ బన్ చాలా బిగుతుగా ఉండాలి. దాంతో జుట్టు లాగుతున్నప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుంది. అలాగే కొప్పు దృఢంగా ఉండాలంటే రకరకాల స్ప్రే, జెల్స్ వాడాల్సి ఉంటుంది. కొప్పు వేసిన కొద్దిసేపటి వరకు, విప్పిన తర్వాత ఐదు నిమిషాల వరకు కొందరిలో తలనొప్పి ఉంటుంది. ఇవన్నీ పక్కనబెడితే, స్నాచ్ బన్‌కి ఉన్న ఆకర్షణ అంతాయింతా కాద’ని అందులో చెప్పుకొచ్చింది. రాణి ముఖర్జీ, దిశా పటానీ, సోనమ్‌కపూర్ వంటి సెలబ్రిటీలకు నమ్రత హెయిర్ స్టయిలిస్ట్‌గా పని చేస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Christmas Special | ఈ క్రిస్మస్కు ప్రత్యేకంగా కనిపించాలా? ఈ డిజైన్లను ట్రై చేయండి
Fashion | పార్టీలు, ఫంక్షన్ల కోసం సింపుల్ అండ్ ట్రెండీ డిజైన్స్
అందం.. అధికారానికి చిహ్నం.. అరబ్ నగలు.. హైదరాబాద్‌కి ప్రత్యేక అనుబంధం
netted fabric | సంప్రదాయంతో పాటు గ్రాండ్ లుక్.. ఇప్పుడు నెట్టెడ్ ఫ్యాబ్రిక్దే హవా..
bandhani fashion | ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు ఇదే ట్రెండ్.. స్కర్ట్స్, లెహంగా అన్ని వీటితోనే..
fashion | రొటీన్‌కు భిన్నంగా మెరిపిస్తున్న మెటాలిక్ ఫ్యాషన్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- fashion
- hair style
- zindagi
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

