Ragging | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 6 : కాకతీయ యూనివర్సిటీలో ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) ఆధ్వర్యంలో పీజీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ర్యాగింగ్ బారిన పడకుండా యూనివర్సిటీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రంకి వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పీడీఎస్యూ కాకతీయ యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి వి కావ్య, ఉపాధ్యక్షురాలు పి అనూష మాట్లాడుతూ.. కేయూలోని బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్లో, వివిధ విభాగాల్లో పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులను రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇంటరాక్షన్(ఐసి) పేరిట వేధింపులకు గురిచేసే అవకాశం ఉన్నదని ఆమె తెలిపారు.
అన్ని విభాగాల్లో సంబంధిత అధ్యాపకుల సమక్షంలోనే పరిచయ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి తప్పితే అధ్యాపకుల ప్రమేయం లేకుండా ఇంటరాక్షన్ పేరిట జూనియర్ విద్యార్థులను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాగింగ్ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ కేయూ నాయకులు గణేష్, శ్రీజ,రాము, సాధన, సంగీత ఉన్నారు.
Crime news | భార్యపై అనుమానంతో ముక్కు కోసేసిన భర్త..!
Chevella | చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా.. 25 మందిపై కేసు నమోదు
Home Minister Anitha | ఏపీని గంజాయిని రాష్ట్రంగా మార్చిన ఘనత జగన్ ది: హోంమంత్రి అనిత