అమీర్‌పేట్, ఫిబ్రవరి 20 : అమీర్‌పేట్ ఆధిత్య ఎన్‌క్లేవ్‌లోని నీలిగిరి బ్లాక్‌లో శుక్రవారం ఉదయం షార్ట్ సర్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది.
విషయం తెలిసిన వెంటనే ఎస్ఆర్నగర్ పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్‌యాదవ్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ సందర్శించారు.