Chevella | చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా.. 25 మందిపై కేసు నమోదు
Chevella | చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా చేసిన 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించారని, అనుమతి లేకుండా ధర్నా చేశారని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Chevella | హైదరాబాద్ : చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా చేసిన 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించారని, అనుమతి లేకుండా ధర్నా చేశారని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం మీర్జగూడ వద్ద ఆర్టీసీ బస్సు–లారీ ఢీకొని 19 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు బాగు చేయాలని ధర్నా చేసిన స్థానికులపై కేసు నమోదు చేయడంపై రేవంత్ సర్కార్‌పై చేవెళ్ల ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.
మీర్జాగూడ గేట్ వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని రాష్ట్ర హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ ప్రమాద ఘటనపై డిసెంబర్ 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. రవాణా శాఖ, హోం శాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారిని, రంగారెడ్డి కలెక్టర్, ఆర్టీసీ ఎండీని నివేదిక పంపాలని హెచ్ఆర్సీ ఆదేశించింది.
చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా చేసిన 25 మందిపై కేసు నమోదు
ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించారని, అనుమతి లేకుండా ధర్నా చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు
సోమవారం మీర్జగూడ వద్ద ఆర్టీసీ బస్సు–లారీ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం
ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు బాగు… https://t.co/jsC4U45ZGr pic.twitter.com/vjDLuIz5FC
— Telugu Scribe (@TeluguScribe) November 6, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

