అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ( Cannabis ) రాష్ట్రంగా మార్చిన ఘనత వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్( YS Jagan ) దేనని హోంమంత్రి వంగలపూడి అనిత ( Home Minister Anitha ) ఆరోపించారు. దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పుకునే పరిస్థితిని వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని విమర్శించారు.
గురువారం మంగళగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో గంజాయిని స్కూల్ పిల్లల బ్యాగ్ల్లోకి చేర్చిన ఘనత కూడా ఆయనేదేనని దుయ్యబట్టారు. ఏడాదిన్నర కూటమి పాలనలో ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చామని వెల్లడించారు.
విశాఖ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ వాడుతూ ఈగల్ టీంకు దొరికిపోయారని, అతడిపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ వద్దు బ్రో అని కూటమి ప్రభుత్వం అంటుంటే వైసీపీ నాయకులు డ్రగ్స్ కావాలి బ్రో అంటున్నారంటూ విమర్వించారు.