Challa Venkateshwar Reddy | హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 5: గజ్వేల్‌లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా సీనియర్ నేత చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై వందాలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడం సిగ్గు చేటన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అనేది ప్రభుత్వ ఆస్తి, అలాంటి కార్యాలయంపై దాడి చేయడం అంటే ప్రభుత్వ ఆస్తులనే ధ్వంసం చేసినట్లేనని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి క్యాంపు కార్యాలయంపైనే ఇలాంటి దాడులు జరుగుతున్న పరిస్థితుల్లో సాధారణ ప్రజలకు భద్రత ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి, దాడికి పాల్పడిన దుండగులను గుర్తించి కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనలో పోలీసులు శాంతి భద్రతలు కాపాడాల్సింది పోయి వారే దగ్గర ఉండి దాడిని ప్రోత్సహించడం అత్యంత గర్హనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Shah Rukh Khan | కింగ్ ఖాన్ హాలీవుడ్ ఎంట్రీ?.. ‘ది వైట్ లోటస్’ వెబ్ సిరీస్‌లో షారూఖ్.!
Watch: పొలంలో కూలిన యూఏవీ.. తర్వాత ఏం జరిగిందంటే?
Sara Arjun | 1300 మందిని ఆడిషన్స్ చేశారట.. ధురంధర్లో సారా అర్జున్ ఎలా ఫైనల్ అయిందంటే..?