లక్నో: మానవరహిత వైమానిక వాహనం (యూఏవీ)ను పరీక్షించేందుకు ఎగురవేశారు. అయితే సాంకేతిక సమస్యల వల్ల ఒక పొలంలో అది కూలిపోయింది. గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. కూలిన యూఏవీ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. (UAV Crashes Into Field) ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 3న సాయంత్రం వేళ లాట్ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసిన మానవరహిత వైమానిక వాహనం (యూఏవీ) నమూనాను సఫాయ్ ఎయిర్‌స్ట్రిప్ నుంచి పరీక్షించారు. సాంకేతిక సమస్య వల్ల అదుపుతప్పిన అది నంద్పూర్ గ్రామం సమీపంలోని పొలంలో కూలిపోయింది.
కాగా, దీనిని గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. కూలిన యూఏవీ గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. అగ్నిమాపక దళం సహాయంతో యూఏవీ శకలాలను సేకరించారు.
మరోవైపు యూఏవీ నమూనాను పరీక్షించడానికి సఫాయ్ ఎయిర్‌స్ట్రిప్ వినియోగం కోసం లాట్ ఏరోస్పేస్ సంస్థ ముందస్తు అనుమతి తీసుకున్నదని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అభినవ్ రంజన్ శ్రీవాస్తవ తెలిపారు. అది కూలిన సంఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని చెప్పారు.
అయితే గ్రౌండ్ రోల్ పరీక్ష జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని లాట్ ఏరోస్పేస్ సంస్థ తెలిపింది. బలమైన గాలుల కారణంగా యూఏవీ నియంత్రణ కోల్పోయి కూలినట్లు పేర్కొంది. ఈ ప్రమాదం వల్ల పంట నష్టపోయిన రైతును సంప్రదించామని, ఆయనకు పరిహారం అందిస్తామని ఆ సంస్థ వెల్లడించింది. కాగా, యూఏవీ పొలంలో కూలిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
युद्ध के वातावरण में अचानक किसी खेत में एक बड़े ड्रोन के, गेहूँ के खेत में गिरने से इटावा ज़िले के सैफई इलाके के नंदपुर गाँव में दहशत और अफ़रातफ़री मच गयी। लोगों ने सोचा कहीं कोई मिसाइल तो नहीं, जो युद्ध क्षेत्र से भटक कर यहाँ आ गिरी है।
अगर ये किसी सरकारी परीक्षण-टेस्ट या… pic.twitter.com/2tlICy92BK
— Akhilesh Yadav (@yadavakhilesh) April 4, 2026
Also Read:
Tempo Falls Into Gorge | లోయలో పడిన టెంపో.. నలుగురు పర్యాటకులు మృతి, 14 మందికి గాయాలు
Woman Helped Lover Kill Husband | ప్రియుడి సహాయంతో భర్తను చంపించిన భార్య.. ముగ్గురు అరెస్ట్
Watch: బురఖా ధరించిన మహిళ.. గన్‌తో బెదిరించి జ్యుయలరీ షాపులో దోపిడీ