సిమ్లా: పర్యాటకులు ప్రయాణిస్తున్న టెంపో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలతో సహా నలుగురు మరణించారు. మరో 14 మంది పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రక్షించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Tempo Falls Into Gorge) హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి ఇద్దరు పిల్లలతో సహా 22 మంది టూరిస్టులు టెంపోలో ప్రయాణించారు. జలోరి పాస్ నుంచి తిరిగి వస్తున్న ఆ వాహనం భూంతర్ వైపు దిగుతుండగా వర్షాల కారణంగా రోడ్డుపై నుంచి లోయలోకి జారిపోయింది.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి వేళ స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరు మహిళలతో సహా నలుగురు పర్యాటకులు అక్కడికక్కడే మరణించినట్లు గుర్తించారు.
మరోవైపు 18 మంది పర్యాటకులను రక్షించి లోయ నుంచి పైకి తీసుకువచ్చారు. వారిలో 14 మంది గాయపటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థతితి విషమంగా ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. ప్రమాదం జరిగిన బంజర్ పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝీబీలోని హోటల్లో ఆ పర్యాటకులు బస చేసినట్లు తెలిసిందన్నారు.
Tragic accident in Banjar, Himachal. A traveller van carrying tourists from Delhi and nearby areas fell into a gorge, 3 lives lost, 5 critically injured, 17 rescued out of 20 onboard. Rescue operation by locals and police is ongoing.
Prayers for the lost lives and a speedy… https://t.co/Z6Pbtr4nOF pic.twitter.com/Ml8wphiRg6
— Nikhil saini (@iNikhilsaini) April 4, 2026
Also Read:
Man Kills 9 Month Old Son | భార్యతో గొడవ.. 9 నెలల కుమారుడ్ని గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి
Watch: పార్క్ చేసిన థార్ వాహనం వేగంగా వెనక్కి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వేగంగా వెళ్తున్న బస్సులోంచి పడిన వృద్ధురాలు.. తర్వాత ఏం జరిగిందంటే?