‘ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి’
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇటీవల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉపాధి అర్హతలపై మాట్లాడే క్రమంలో వారిని క్రిమినల్ వేస్ట్ అని సంబోధిస్తూ చేసిన వాక్యాలను ఏఐఎస్ఐ రాష్ట్ర సమితి సభ్యుడు బూర.మనోజ్ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి...
– ఏఐఎస్ఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బూర.మనోజ్
ఖమ్మం రూరల్, ఆగస్టు 01 : తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇటీవల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉపాధి అర్హతలపై మాట్లాడే క్రమంలో వారిని క్రిమినల్ వేస్ట్ అని సంబోధిస్తూ చేసిన వాక్యాలను ఏఐఎస్ఐ రాష్ట్ర సమితి సభ్యుడు బూర.మనోజ్ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటువంటి వాక్యాలు చేయడం చాలా దురదృష్టకరమని అన్నారు. సీఎం వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యా సంస్థల మనోధైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఒకవైపు జెన్ జీ యువతకు గౌరవం ఇవ్వాలని, వారి ప్రతిభను వినియోగించుకోవాలని చెబుతూ, మరోవైపు ఇంజినీరింగ్ విద్యార్థులను కించపరిచేలా మాట్లాడడం ఆయన ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు దేశ అభివృద్ధికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను సంపాదించేందుకు కష్టపడుతున్నారని, అలాంటి విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఉన్నత విద్య శాఖలో పర్యవేక్షణలో లోపాలు, సరైన తనిఖీలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, ఇంజినీరింగ్ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు చేపట్టాలని మనోజ్ డిమాండ్ చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

