గిద్దవారిగూడెం అంగన్వాడీలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కారేపల్లి మండలం వెంకటీయ్య తండాలో గల గిద్దవారిగూడెం టు అంగన్వాడీ కేంద్రంలో శనివారం బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ జర్పుల శాంతి గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు.
కారేపల్లి, ఆగస్టు 01 : ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కారేపల్లి మండలం వెంకటీయ్య తండాలో గల గిద్దవారిగూడెం టు అంగన్వాడీ కేంద్రంలో శనివారం బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ జర్పుల శాంతి గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. పుట్టిన వెంటనే శిశువుకు ముర్రుపాలు పట్టించడం ఎంతో అవసరమన్నారు. పుట్టిన తొలి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ఆమె సూచించారు. తల్లి పాలలో శిశువు ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు ఉండటంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు.
తల్లిపాలు శిశువుకు తొలి ఆహారం, తొలి టీకా, ప్రకృతి ప్రసాదించిన అమృతమని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా దేశ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. తల్లులు తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగించుకోవాలని, శిశువుల ఆరోగ్యవంతమైన భవిష్యత్ కోసం ప్రతి తల్లి తల్లిపాలను తప్పనిసరిగా అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

గిద్దవారిగూడెం టు అంగన్వాడీలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

