లక్నో: భార్యతో గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. 9 నెలల కుమారుడ్ని గొడ్డలితో నరికి చంపాడు. ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Man Kills 9 Month Old Son) ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 3న కుద్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధా గ్రామానికి చెందిన శంభుద్యాల్ కోరి తన భార్య రంజుతో గొడవపడ్డాడు. ఈ సందర్భంగా ఆగ్రహించిన అతడు కుమారుడైన 9 నెలల పసికందు శివాంశ్పై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో పసి బాలుడు అక్కడికక్కడే మరణించాడు.
కాగా, ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఎస్పీ, ఏఎస్పీలతో పాటు ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పసికందు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో పడి ఉన్న గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు నిందితుడైన శంభుద్యాల్ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తున్నదని చెప్పారు. వైద్య పరీక్షల తర్వాత దీనిని నిర్ధారిస్తామని అన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Fire At Offshore Oil Field | ఆఫ్షోర్ చమురు క్షేత్రంలో అగ్నిప్రమాదం.. పది మందికి గాయాలు
Watch: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై ఎద్దు దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: బురఖా ధరించిన మహిళ.. గన్తో బెదిరించి జ్యుయలరీ షాపులో దోపిడీ