ఊట్కూర్ (కృష్ణ), ఆగస్టు 5 : కర్ణాటక రాష్ట్రం యాద్గిరి జిల్లా కడేచూర్-బడియాల్ పారిశ్రామిక వాడలో విషాద ఘటన చోటు చేసుకున్నది. సీఐఎల్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ రసాయన కర్మాగారంలో మంగళవారం అర్ధరాత్రి 2గంటల సమయంలో రసాయనాలు లీకై విషవాయువులు వ్యాపించగా.. ముగ్గు రు కార్మికులు మృతి చెందగా.. పలువు రు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మృ తుల్లో ఒకరు నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ఆలంపల్లికి చెందిన గణేశ్(21)తోపాటు బీహార్‌కు చెందిన విక్రమ్‌సింగ్ (36), నిరంజన్‌సింగ్ (30) ఉన్నారు. అలాగే ఏపీలోని అనంతపు రం జిల్లాకు చెందిన హేమంత్, శివకుమార్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వీరిని రాయిచూర్ రిమ్స్ దవాఖానకు తరలించారు. ఘటన అనంతరం పోలీసులు, ఫ్యాక్టరీ భద్రతా అధికారులు ఘ టనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. కెమికల్ లీకేజీ ఎలా జరిగింది ? భద్రతా ప్రమాణాలు పాటించారా..? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. సైదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. కృష్ణ మండలం బీఆర్ఎస్ యువ నేత శివరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో స్థానికులు పెద్ద సంఖ్యలో ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం అందజేయాలని, బాధ్యులపై క్రి మినల్ కేసులు నమోదు చేయాలని డి మాండ్ చేశారు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో అనుమతులు లేకుండా కెమికల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడంతోనే ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తున్నట్లు ఆరోపిస్తూ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా చేపట్టారు. అధికారులు ఇచ్చిన హామీతో చివరకు శాంతించారు. విషయం తెలుసుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కార్మికుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
కర్ణాటకలో చోటుచేసుకున్న ఘోర పారిశ్రామిక ప్రమాదం మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మృతి చెందిన వారిలో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ఆలంపల్లికి చెందిన గణేశ్ (21) ఉన్నారు. కొన్నేళ్ల కిందట గణేశ్ తండ్రి కట్ల దేవప్ప మృతి చెందడంతో తల్లి పద్మమ్మపై కుటుంబ భారం పడింది. కుటుంబానికి ఆధారంగా నిలవాల్సిన గణేశ్ అకాల మృతితో బంధువులు, గ్రామస్తులు వారి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. గణేశ్ అతడి కుటంబంలో రెండో సంతానం. కుటుంబ భారం పం చుకోవాలనే లక్ష్యంతో ఆరు నెలల కింద ట బయో కెమికల్స్ ఫ్యాక్టరీలో కెమిస్ట్‌గా ఉద్యోగంలో చేరాడు. స్వగ్రామానికి స మీపంలోనే పరిశ్రమ ఉండటంతో ఉద్యోగాన్ని ఎం చుకున్నాడు. రాత్రి 10గంటల నుం చి తెల్లవారుజామున 6గంటల వరకు కొనసాగే ’సీ’ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న గణేశ్ ప్రమాదం జరిగిన రాత్రి కూడా ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లాడు. అయితే అదే అతని జీవితంలో చివరి విధిగా మారింది.
రాత్రి విధులకు వెళ్లిన గణేశ్ మళ్లీ ఇం టి గడప దాటుతాడని తల్లి పద్మమ్మ ఎదురుచూసింది. కానీ తెల్లవారేసరికి అతని మరణవార్త చేరడంతో ఆ కుటుం బం శోకసంద్రంలో మునిగిపోయింది. ఉపాధి కోసం వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగి రావడం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులను కలచివేసింది.