హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ( Danam Nagendhar ) పై హైకోర్టు ( High Court ) సంచలన తీర్పు నిచ్చింది. శుక్రవారం ఫిరాయింపు చట్టం ప్రకారం హైకోర్టు దానం నాగేందర్‌పై ఎమ్మెల్యేగా అనర్హుడంటూ ( Disqualified) వేటు వేసింది.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టు తీర్పుపై స్పందిం చారు. మిగిలిన ఫిరాయింపుదారులకు ఇదే గతి పడుతుందని జోస్యం చెప్పారు. సత్యమేవ జయతే నంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Satyameva Jayate !!
BRS MLA Danam Nagendar who defected to Congress got disqualified by the Hon’ble High Court today
The rest of the defectors will also meet the same fate soon
— KTR (@KTRBRS) September 18, 2026
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, వివేక్‌రెడ్డి హైకోర్టుకు తెలియజేస్తూ.. పార్టీ ఫిరాయింపులకు ఇంతకంటే వేరే ఆధారాలు అవసరం లేదని అతడిపై వేటు వేయాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.