Vijayasai Reddy | చంద్రబాబు, వైఎస్ జగన్‌పై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Vijayasai Reddy | మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు , విపక్షంలో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి పై పలు ఆరోపణలు చేశారు.
అనంతపురం : మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ( Vijayasai Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు( Chandra babu ) , విపక్షంలో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ( YS Jagan ) పై పలు ఆరోపణలు చేశారు. అనంతపురంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇద్దరూ రాయలసీమ ప్రాంత వాసులే అయినప్పటికీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించలేదని ఆరోపించారు.
రెండు పార్టీలే ఏపీలో అధికారంలో ఉంటున్నాయని వాటికి ప్రత్నామ్నయంగా దసరా రోజున తాను పార్టీని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవ పౌరుషాన్ని కాపాడుతానని ప్రకటించారు. అన్ని కులాలు, మతాలను గౌరవించే పార్టీ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ నుంచి రెడ్లు మాత్రమే కాదని, చాలా మంది దేశం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు.
త్వరలో తన కూతురు టీవీ ఛానల్ పెడుతున్నారని, ఆ ఛానల్‌కు తనకు సంబంధం లేదని వెల్లడించారు. ఆ ఛానల్ న్యూటరల్గా ఉంటుందని చెప్పుకొచ్చారు. తమ పార్టీ కనుమరుగయ్యే అవకాశం లేదని ఒక ప్రశ్నకు సమాదానమిచ్చారు. తమిళనాడు సీఎం విజయ్ టీవీకే పార్టీ తరహాలో ఇక్కడి ప్రజలు తమకు ఓట్లు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

