Asian Games | చరణి స్పిన్‌కు జపాన్ విలవిల.. ఆసియా క్రీడల సెమీఫైనల్లో భారత్..!
Asian Games : ఆసియా క్రీడల్లోనూ భారత మహిళల జట్టు అదరగొట్టింది. క్వార్టర్ ఫైనల్లో తిప్పేసిన శ్రీ చరణి(4-10) కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడంతో అలవోకగా జపాన్(Japan)ను చిత్తు చేసింది టీమిండియా.
Asian Games : ఆసియా క్రీడల్లోనూ భారత మహిళల జట్టు అదరగొట్టింది. క్వార్టర్ ఫైనల్లో తిప్పేసిన శ్రీ చరణి(4-10) కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడంతో అలవోకగా జపాన్(Japan)ను చిత్తు చేసింది టీమిండియా. స్వల్ప ఛేదనలో ఓపెనర్ షఫాలీ వర్మ(40 నాటౌట్, 2-13) విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించింది. ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయం సాధించిన ఉమెన్ ఇన్ బ్లూ సెమీస్‌కు దూసుకెళ్లింది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆసియా కప్‌లో అడుగుపెట్టిన భారత జట్టు టైటిల్ నిలబెట్టుకునే దిశగ సాగుతోంది. నిరుడు గోల్డ్ మెడల్‌తో సత్తా చాటిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం.. దర్జాగా సెమీస్‌లో దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జపాన్ బ్యాటర్లను శ్రీ చరణి(4-10) వణికించింది. ఈ తెలుగమ్మాయి సంచలన ప్రదర్శనరతో 57 పరుగులకే ఆతిథ్య దేశం జట్టు కుప్పకూలింది. అనంతరం ఓపెనర్ షఫాలీ వర్మ(40 నాటౌట్) తుఫాన్ ఇన్నింగ్స్‌తో 5 ఓవరల్లోనే ఉమెన్ ఇన్ బ్లూ జయకేతనం ఎగురవేసింది.
చరణి, షఫాలి పోటీపడి
తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ను భారత స్పిన్నర్లు స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. ఓపెనర్ అయకా కటో స్టఫోర్డ్(25) ప్రతిఘటించినా.. శ్రీ చరణి(4-10), షఫాలీ వర్మ(2-13)ల ధాటికి మిగతా వారు ఇలా వచ్చి అలా వెళ్లారు. ఒకే ఓవర్లో రెండేసి వికెట్లతో చరణి జపాన్ను కోలుకోలేని దెబ్బకొట్టింది. ఈ స్పిన్ ద్వయం వికెట్ల వేటతో ప్రత్యర్థిని 57కే పరిమితం చేసింది టీమిండియా. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఐదు ఓవర్లలోనే టీమిండియా ఉఫ్‌మనిపించింది.
Innings Break!
A splendid effort from #TeamIndia with the ball 👏
Our chase on the other side ⌛️
Scorecard ▶️ https://t.co/MIoR07Vyms #AsianGames pic.twitter.com/U7MMqjjGDm
— BCCI Women (@BCCIWomen) September 18, 2026
ఓపెనర్ షఫాలీ వర్మ(40 నాటౌట్) మెరుపు అరంభాన్నిస్తూ.. 15 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో విరుచుకుపడింది. జి.కమలిని(0), భారతి ఫుల్మాలి(6)లు విఫలమైనా షఫాలి దూకుడుతో జపాన్ బౌలర్లు అల్లాడిపోయారు. రీచా ఘోష్(12 నాటౌట్) జతగా టీమిండియాకు 8 వికెట్ల విజయం కట్టబెట్టింది డాషింగ్ ఓపెనర్. అద్భుత విజయంతో సెమీస్ చేరిన భారత్.. ఫైనల్ బెర్తు కోసం సెప్టెంబర్ 20వ తేదీన బంగ్లాదేశ్‌ను ఢీ కొట్టనుంది. అదే రోజు ఉదయం తొలి సెమీస్‌లో పాకిస్థాన్, శ్రీలంక తలపడనున్నాయి.
Here’s how Shree Charani struck off consecutive deliveries ✅pic.twitter.com/4WHUVOAkvo https://t.co/lkGdmk3eEL
— Cricbuzz (@cricbuzz) September 18, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

