Breathalyser Test | బ్రీత్ అనలైజర్ పరీక్షలో జాప్యం.. నలుగురు పైలట్లతో సహా 8 మందిని సస్పెండ్ చేసిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్
Breathalyser Test | బ్రీత్లైజర్ పరీక్షలో జాప్యం చేసిన పైలట్లు, సిబ్బందిపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ విమాన ప్రయాణం తర్వాత నిర్దేశించిన రెండు గంటల వ్యవధిలోగా తప్పనిసరిగా బ్రీత్లైజర్ పరీక్ష చేయించుకోనందుకు నలుగురు పైలట్లతో సహా ఎనిమిది మంది సిబ్బందిని సస్పెండ్ చేసింది.
న్యూఢిల్లీ: బ్రీత్ అనలైజర్ పరీక్షలో జాప్యం చేసిన పైలట్లు, సిబ్బందిపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ విమాన ప్రయాణం తర్వాత నిర్దేశించిన రెండు గంటల వ్యవధిలోగా తప్పనిసరిగా బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయించుకోనందుకు నలుగురు పైలట్లతో సహా ఎనిమిది మంది సిబ్బందిని సస్పెండ్ చేసింది. (Breathalyser Test) ఆగస్ట్ 2న దుబాయ్-అమృత్సర్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం అమృత్సర్లోని గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత రెండు గంటల్లోగా ఆ విమాన సిబ్బంది తప్పనిసరిగా పోస్ట్-ఫ్లైట్ డిక్లరేషన్కు హాజరు కావాల్సి ఉన్నది.
కాగా, ఆ విమాన సిబ్బందిలో కొందరు 35 నిమిషాలు ఆలస్యంగా బ్రీత్ అనలైజర్ పరీక్షకు హాజరయ్యారు. విమానం ల్యాండ్ అయిన 2 గంటల 35 నిమిషాల తర్వాత తమ డిక్లరేషన్ను వారు సమర్పించారు. ఈ నేపథ్యంలో తమ సిబ్బంది పాల్పడిన ఈ ఉల్లంఘనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నివేదించింది. నలుగురు పైలట్లతో సహా ఎనిమిది మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు అందులో పేర్కొంది.
మరోవైపు గత నెలలో ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం భారీ కుదుపులకుగురైంది. ఆ పైలట్ గంజాయి సేవించినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణం తర్వాత నిర్దేశిత వ్యవధిలోగా సిబ్బందికి బ్రీత్ అనలైజర్ పరీక్షలను విమానయాన సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాలని డీజీసీఏ ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

