Asian Games : జపాన్ ఆతిథ్యమిస్తున్న ఆసియా క్రీడల్లో అథ్లెట్లకు వసతులు సవాల్ విరుసుతున్నాయి. ఇది చాలదన్నట్టు వాతావరణం కూడా క్రీడాకారులను పరీక్షించనుంది. ఐచీ నగొయ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీకి తుఫాన్ (Typhoon) ముప్పు పొంచి ఉంది. తీర ప్రాంతమైన ఈ నగరంలో రాబోయే రోజుల్లో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని సమాచారం. వాతావరణ శాఖ హెచ్చరికతో అప్రమత్తమైన నిర్వాహకులు అలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడితే.. తాత్కాలికంగా అథ్లెట్లను తరలిస్తామని వెల్లడించారు.
పద్దెనిమిదో ఆసియా క్రీడలకు విచ్చేసిన అథ్లెట్లకు కంటెయినర్లలో, పెద్ద ఓడలో వసతి ఏర్పాట్లపై పలు దేశాలు పెదవి విరుస్తున్నాయి. క్రీడాకారుల వసతులపై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న జపాన్.. రాబోయే రోజుల్లో తుఫాన్ తీవ్రతను చవిచూడనుంది. సముద్ర తీర ప్రాంతమైన ఐచీ నగొయలో ఉష్ణమండల తుఫాన్ దుజాన్(Dujuan) కారణంగా భారీ వర్షంతో పాటు బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
🚨 TYPHOON THREAT TO ASIAN GAMES 🇯🇵
After torrential rain caused disruption across Nagoya, another weather threat looms over the Aichi-Nagoya Asian Games.
Tropical Storm Dujuan is moving northwest towards central Japan, packing maximum sustained winds of 90 km/h and gusts of up… pic.twitter.com/3SOiFnMI6M
— The Khel India (@TheKhelIndia) September 18, 2026
ఈ తుఫాన్ గురువారం (సెప్టెంబర్ 17) మధ్య జపాన్ వైపు కదిలిందని ..సెప్టెంబర్ 21 సోమవారం ఇది ఆతిథ్య నగరానికి విస్తరించనుందని సమచారం. దీని ఫలితంగా గంటకు 90 నుంచి 126 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేందుకు ఆస్కారముందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ విషయంపై నగోయ మేయర్, ఆసియా క్రీడలకు ఉపాధ్యక్షుడిగా వ్యహరిస్తున్న ఐచిరో హిరోసవా మీడియాతో మాట్లాడుతూ.. వర్షంలోనూ టోర్నీ కొనసాగుతుందని చెప్పాడు. ఒకవేళ.. తుఫాన్ తీవ్రతకు బలమైన గాలులు వీస్తే.. క్రీడాకారులను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని ఆయనపేర్కొన్నాడు.
🚨 BREAKING: TYPHOON THREAT IN NAGOYA, JAPAN!
A typhoon with winds of around 100 km/h could hit Nagoya in 2 days during the Asian Games 2026.
Around 4,000 athletes are staying on a cruise ship. What happens if the storm hits? 😳 (RevSportz Global) pic.twitter.com/AYBO7gjfpC
— Sports Apna 🇮🇳 (@sportsapna1) September 18, 2026
‘సాధారణ వర్షం కురిసినా ఆసియా క్రీడలు యథావిధిగా జరుగుతాయి. ఒకవేళ భారీ వర్షం, తుఫాన్ హెచ్చరికలు వస్తే అథ్లెట్లను తాత్కాలికంగా మరో ప్రాంతానికి తరలిస్తాం. ఇక క్రీడాకారులకు బస ఏర్పాటు చేసిన ఇటాలియన్ క్రూయిష్ షిప్ను కూడా తీరం నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తాం’ అని హిరోసవా వెల్లడించాడు. ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19న మొదలై.. అక్టోబర్ 4 వ తేదీన ముగియనున్నాయి.