ముంబై: ఆఫ్‌షోర్ చమురు క్షేత్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. వారికి చికిత్స అందిస్తున్నట్లు ఓఎన్జీసీ అధికారులు తెలిపారు. అలాగే మంటలను అదుపుచేసినట్లు చెప్పారు. (Fire At Offshore Oil Field) మహారాష్ట్ర రాజధాని ముంబై తీరం సమీపంలోని, అరేబియా సముద్రంలో ఉన్న, ఓఎన్జీసీ ముంబై హై ఆఫ్‌షోర్ చమురు క్షేత్రంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం 5.45 గంటల సమయంలో ఎస్‌హెచ్‌పి ప్లాట్‌ఫామ్‌పై అగ్నిప్రమాదం సంభవించింది. అత్యవసర ప్రతిస్పందన బృందాలు వెంటనే స్పందించాయి. మంటలను ఆర్పివేశాయి.
కాగా, ఈ అగ్ని ప్రమాదంలో పది మంది సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఓఎన్జీసీ తెలిపింది. ఈ సంఘటన తరువాత ఆఫ్‌షోర్ ఇన్‌స్టాలేషన్‌లో కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని ఆ సంస్థ పేర్కొంది.
Also Read:
Builder Steps On Wife’s Neck | భార్య మెడను కాలుతో తొక్కి.. దారుణంగా హత్య చేసిన బిల్డర్
Students Face Breathing Issues | విష వాయువులు పీల్చడంతో.. 26 మంది విద్యార్థులకు అస్వస్థత
Watch: వేగంగా వెళ్తున్న బస్సులోంచి పడిన వృద్ధురాలు.. తర్వాత ఏం జరిగిందంటే?