Saurav Das | ఆమెకు నేను హృతిక్ రోషన్‌లా కనిపించానేమో.. కంగనా విమర్శలపై సౌరవ్ దాస్ రెస్పాన్స్..!
Saurav Das | బీజేపీ ఎంపీ (BJP MP), నటి కంగనా రనౌత్ (Actress Kangana Ranaut) తనపై చేసిన విమర్శలపై కాక్రోజ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ (Saurav Das) స్పందించారు. తనను పనికిరాని వాడు, నిరుద్యోగి అని పిలవడాన్ని తప్పుపట్టారు. తన గురించి గూగుల్‌లో సెర్చ్ (Google search) చేసి ఆమె విమర్శలు చేశారని మండిపడ్డారు.
Saurav Das : బీజేపీ ఎంపీ (BJP MP), నటి కంగనా రనౌత్ (Actress Kangana Ranaut) తనపై చేసిన విమర్శలపై కాక్రోజ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ (Saurav Das) స్పందించారు. తనను పనికిరాని వాడు, నిరుద్యోగి అని పిలవడాన్ని తప్పుపట్టారు. తన గురించి గూగుల్‌లో సెర్చ్ (Google search) చేసి ఆమె విమర్శలు చేశారని మండిపడ్డారు. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇలాంటి తప్పుడు సమాచారమే వస్తుందని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో సౌరవ్ మాట్లాడుతూ.. కంగనా ఈ దేశ భవిష్యత్ తరాలను, యువతను తీవ్రంగా విమర్శిస్తున్నారని చెప్పారు.
కంగనా తన వ్యాఖ్యలపై ఎందుకు అంతగా స్పందించారో తనకు అర్థం కావడం లేదని, ఇదే మాట తన స్నేహితులు కూడా అంటున్నారని సౌరవ్ దాస్ చెబుతున్నారు. ‘ఆమెకు నువ్వు చిన్నప్పటి హృతిక్ రోషన్ లాగా కనిపిస్తున్నావేమో’ అని తన ఫ్రెండ్ మెసేజ్ చేసినట్లు తెలిపారు. అది నిజమేనా..? నా స్నేహితులు హృతిక్ రోషన్‌తో పోల్చడంతో నేను చాలా ఆశ్చర్యపోయానని అన్నారు. కంగనాకు కూడా తాను చిన్ననాటి హృతిక్ రోషన్‌లా కనిపిస్తున్నానేమో అంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పారు. అయితే తనకు కంగనాపై వ్యక్తిగత ద్వేషం లేదని సౌరవ్ స్పష్టం చేశారు.
ఆమెతో గొడవ పడాల్సిన అవసరం తనకు లేదని, విభేదాలు ఏవైనా ఉంటే చర్చించి పరిష్కరించుకోవాలని సౌరవ్ దాస్ అన్నారు. ఈ రోజు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలోనూ ఇదే పోస్ట్ చేశానని, ‘కంగనా కాస్త ప్రశాంతంగా ఉండండి.. మాట్లాడుకుందాం’ అని క్యాప్షన్ పెట్టానని తెలిపారు. దేశంలో చర్చలు, సంభాషణలు తగ్గిపోవడం పెద్ద సమస్యగా మారిందని అన్నారు. పరస్పర గౌరవంతో చర్చించుకునే వాతావరణం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే కంగనా తన వ్యాఖ్యలను పునఃసమీక్షించుకోవాలని హితవు పలికారు. తనతో మాట్లాడాలంటే కంగనా డైరెక్ట్‌గా ఫోన్ చేయవచ్చని.. ఆమెతో సంభాషించడానికి తనకు ఎలాంటి అభ్యంతరంలేదని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

