Shah Rukh Khan | ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘ది వైట్ లోటస్’ (The White Lotus) మూడో సీజన్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఈ క్రేజీ సిరీస్‌లో నటించబోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. హెచ్‌బీఓ (HBO) ఛానెల్లో అత్యంత పాపులర్ అయిన డార్క్ కామెడీ డ్రామా సిరీస్ ‘ది వైట్ లోటస్’. దీని మూడో సీజన్ చిత్రీకరణ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. అయితే, ఈ సిరీస్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే తప్పుకుందనే వార్తలు వచ్చిన కొద్ది రోజులకే.. ఆ స్థానంలోకి షారూఖ్ ఖాన్ రాబోతున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. షారూఖ్ ఖాన్ ప్రస్తుతం తన సొంత భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడని. హాలీవుడ్ షోలలో నటించే ఆలోచన ఆయనకు ప్రస్తుతానికి లేదని వెల్లడించినట్లు తెలుస్తుంది. మరోవైపు ‘ది వైట్ లోటస్’ టీమ్ గానీ, షారూఖ్ మేనేజ్మెంట్ గానీ ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.