Health Tips | మామిడి పండ్లు తినగానే ఇవి తీసుకుంటున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టినట్లే..!
Mangoes | వేసవి ఆగమనంతోనే మార్కెట్లోకి మామిడి పండ్ల (Mangoes) రాక మొదలవుతుంది. మన దేశం మామిడి పండ్లకు ఎంతో ప్రసిద్ధి. ప్రపంచంలో మరెక్కడా లభించనన్ని రకాల మామిడి పండ్లు భారత్ (India) లో లభిస్తాయి. అంతేకాదు దేశంలోని మామిడిపండ్లు రకరకాల రుచుల్లో అందుబాటులో ఉంటాయి.
Mangoes : వేసవి ఆగమనంతోనే మార్కెట్లోకి మామిడి పండ్ల (Mangoes) రాక మొదలవుతుంది. మన దేశం మామిడి పండ్లకు ఎంతో ప్రసిద్ధి. ప్రపంచంలో మరెక్కడా లభించనన్ని రకాల మామిడి పండ్లు భారత్ (India) లో లభిస్తాయి. అంతేకాదు దేశంలోని మామిడిపండ్లు రకరకాల రుచుల్లో అందుబాటులో ఉంటాయి. ఈ మామిడి పండ్లను నేరుగా తినొచ్చు. జ్యూస్‌లుగా చేసుకుని తాగవచ్చు. మామిడి తాండ్ర, మామిడి కరేలా లాంటి పదార్థాలు తయారు చేసుకుని కూడా తినొచ్చు. అయితే ఈ మామిడిపండ్లు తిన్న తర్వాత ఓ ఐదు రకాల పదార్థాల జోలికి అస్సలు పోవద్దట. ఆ పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం..
మంచి నీళ్లు : మామిడి పండ్లు తిన్న తర్వాత కొంతసేపటి వరకు మంచినీళ్లను అస్సలు తాగొద్దట. అలా చేస్తే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందట. కడపు నొప్పి, అసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదట.
పెరుగు : మామిడి పండు తినగానే పెరుగు తీసుకుంటే శరీరం డీహైడ్రేట్ అవుతుందట. అందువల్ల అలాంటి అలవాటు ఉంటే తక్షణమే మానుకోవాలట. లేదంటే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందట. అంతేగాక చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నదట.
కాకరకాయ : మామిడి పండ్లు తిన్న తర్వాత కాకరకాయ తీసుకోవడం కూడా మంచిది కాదట. అలా చేయడంవల్ల వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయట.
ఘాటైన పదార్థాలు : మామిడి పండ్లు తిన్న తర్వాత ఘాటు పదార్థాలుగానీ, కారం పదార్థాలుగానీ తీసుకుంటే ఉదర సంబంధ సమస్యలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదట. అంతేగాక ముఖంపై మొటిమలు వచ్చే ప్రమాదం కూడా ఉన్నదట.
చల్లటి పానీయాలు : మామిడి పండ్లతోపాటు చల్లటి పానీయాలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరమట. చల్లటి పానీయాలతో మామిడి పండ్లను తీసుకోవడంవల్ల షుగర్ లెవల్స్ మరింత పెరుగుతాయట.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

