Challa Venkateshwar Reddy | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 19 : కాంగ్రెస్ పార్టీ మోసాన్ని సహించేది లేదని ఇందిరమ్మ చీరల పేరుతో మరోసారి మహిళలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నదని బీఅర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు.
గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రేవంత్‌రెడ్డి అనుకున్నారు కాబట్టి ఓట్లు దండుకోవడానికి మరొక ఎత్తుగడ వేశారన్నారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరిట చీరలు పంచి, రౌడీషీటర్లను అడ్డం పెట్టుకొని ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి భారీఎత్తున రిగ్గింగ్ చేసి ఉప ఎన్నికల్లో గెలిచారు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి పాలన గాలికి వదిలేసి మంత్రులు రాజకీయం చేయడం తగదన్నారు.
ఇప్పటికైనా మ్యానిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Irregularities | వే బ్రిడ్జిలో అవకతవకలు.. రైస్‌మిల్లును మూసేయాలని రైతుల డిమాండ్
Shaligouraram : మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే మందుల సామేల్
AI Course | యువత కోసం ఫ్రీ AI కోర్స్.. పూర్తిచేస్తే కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్