AI Course : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – AI) కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని యువత కోసం కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేథపై విద్యార్థులు, ఉద్యోగులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఒక కోర్సును రూపొందించింది. ‘యువ ఏఐ ఫర్ ఆల్ (Yuva AI for All)’ పేరిట ఈ కోర్సును అందిస్తున్నది.
ఈ కోర్సు 4.5 గంటల నిడివి కలిగి ఉన్నది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఏఐపై ప్రాథమిక అవగాహన ఏర్పడనుంది. కోర్సును చాలా సరళంగా, నిజ జీవితంలో ఉపయోగించే ఉదాహరణలతో రూపొందించారు. ఇది ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్, iGOT కర్మయోగి సహా మిగిలిన ప్రముఖ ఎడ్టెక్ పోర్టళ్లలో అందుబాటులో ఉంది. కోర్సు పూర్తి చేసిన వారికి భారత ప్రభుత్వం సర్టిఫికెట్ కూడా ఇవ్వనుంది. ఈ కోర్సులో మొత్తం ఆరు మాడ్యూల్స్ ఉంటాయి.
నేర్చుకునే అంశాలు
ఏఐ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది?
విద్య, సృజనాత్మకత, ఉద్యోగాలను ఏఐ ఎలా మారుస్తోంది?
ఏఐ టూల్స్‌ను భద్రంగా, బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలి?
నిజజీవితంలో ఏఐ వాడే విధానం
ఏఐ భవిష్యత్తు.. రాబోయే అవకాశాలు
రిజిస్ట్రేషన్ ఎలా..?
futureskillsprime.in/course/yuva-ai-for-all అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి
హోమ్‌పేజ్ కుడివైపు ‘ఎన్రోల్’పై క్లిక్ చేయాలి
గూగుల్ లేదా లింక్డిన్ ఖాతా ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి
పేరు, పుట్టినతేదీ, జెండర్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి
మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీతో ధ్రువీకరించాలి
అపార్ ఐడీ ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకపోయినా పరవాలేదు
చివరగా చెక్‌బాక్స్‌లో టిక్ చేసి సబ్మిట్ చేయాలి