శాలిగౌరారం, నవంబర్ 19 : మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. బుధవారం శాలిగౌరారం ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న పలు రకాల పథకాలను సద్వినియోగం చేసుకుని లబ్దిదారులు ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్య శాఖ అభివృద్ధి ఇన్చార్జి అధికారి రాజారామ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి, తాసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, నాయకులు కందాల సమరం రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి, చాముల వెంకటరమణరెడ్డి, మహేందర్ రెడ్డి, వడ్లకొండ పరమేశ్, వేముల గోపి, మత్య సంఘం మాజీ ప్రతినిధులు గందసరి వెంకన్న, పడాల సైదులు, సాదుల నర్సయ్య, కనుకు వెంకట్ నారాయణ పాల్గొన్నారు.