తొర్రూరు : బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం, మడిపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో( joining brs) చేరారు. పర్వతగిరిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar rao) గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర అసంతృప్తితోనే బీఆర్ఎస్ పార్టీలో చేరామని ఉద్యమ నాయకులు వేల్పుల వెంకన్న, ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి నర్రా జంపయ్య, యువ కాంగ్రెస్ నాయకులు ఎండీ పాషా, అబ్బనాపూరి వీరచారి అన్నారు.
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి పాలనపై అవగాహన లేకపోవడంతో గత పదేండ్లు అభివృద్ధిలో ముందున్న రాష్ట్రం నేడు దివాలా తీసే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
Bomb threat | అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు..!
Bangladesh | బంగ్లాదేశ్లో ఆపరేషన్ డెవిల్ హంట్.. 1,300 మంది అరెస్ట్
Sonia Gandhi:వీలైనంత త్వరగా జనాభా లెక్కలు చేపట్టండి: సోనియా గాంధీ డిమాండ్