Bomb threat : ఈ మధ్య ఎయిర్పోర్టుల (Airports) ను, స్కూళ్ల (Schools) ను పేల్చివేస్తామంటూ ఫోన్ల ద్వారా, లేఖల ద్వారా బెదిరింపులకు పాల్పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా అలాంటి బెదిరింపు లేఖనే మరోసారి కలకలం రేపుతోంది. గుజరాత్ రాష్ట్రం (Gujarat state) అహ్మదాబాద్ (Ahmedabad) లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Patel) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) ను బాంబులతో పేల్చివేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు.
ఈ మేరకు ఎయిర్పోర్టుకు లేఖ పంపారు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శరద్ సింఘాల్ మీడియాకు వెల్లడించారు. బెదిరింపు లేఖ వార్త ఎయిర్పోర్టులో తీవ్ర కలకలం రేపింది. ఎయిర్పోర్టు భద్రతాసిబ్బంది అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Ayodhya Ram Mandir | ప్రయాగ్రాజ్ టూ అయోధ్య.. బాల రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు..
Vitamin C Deficiency Symptoms | ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే విటమిన్ సి లోపం ఉన్నట్లే..!
Sonia Gandhi:వీలైనంత త్వరగా జనాభా లెక్కలు చేపట్టండి: సోనియా గాంధీ డిమాండ్