బెంగళూరు, జూలై 28: వివాహేతర సంబంధముందన్న అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను (23) అత్యంత కిరాతకంగా ఉరితీసి చంపాడు. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న బాధితురాలు..ప్రాణం కోసం గిలగిల్లాడుతుండగా అత్తామామకు వీడియో కాల్ చేసి అక్కడ జరుగుతున్న దారుణాన్ని చూపించాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణమైన ఘటన గత ఆదివారం సాయంత్రం కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఘటనలో భాగ్యశ్రీ జిగళూర్ బాధితురాలు కాగా, ఆమె భర్త ప్రవీణ్ జిగళూర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గలగలి గ్రామంలోని తమ ఇంట్లో భార్యను ఉరితీసే ముందు ప్రవీణ్ ఆమెపై కర్రతో దాడి చేసినట్టు తెలుస్తున్నది. తరచూ గొడవలు జరుగుతుండటంతో రెండు నెలల కిందట భాగ్యశ్రీ తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఇకపై ప్రశాంతంగా ఉందామంటూ కొద్ది రోజుల క్రితం భాగ్యశ్రీని ప్రవీణ్ ఆదివారం ఇంటికి తీసుకొచ్చాడు.