తిరుమల : వడ్డీకాసులవాడు శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల ( Tirumala )లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్టుమెంట్లు ( Compartments ) అన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 83,578 మంది భక్తులు దర్శించుకోగా 31,137 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు తమ మొక్కుల ద్వారా చెల్లించుకున్న కానుకల వల్ల రూ.5.07కోట్లు ఆదాయం (Srivari Hundi ) వచ్చింది. 4.39 లక్షల లడ్డూలను విక్రయించగా 2.88 లక్షల మందికి అన్నదానం చేశామన్నారు .