Iran vs US | అమెరికాతో అంతిమ యుద్ధానికి మేం సిద్ధంగా ఉన్నాం.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్..!
Iran vs US | ఇరాన్ (Iran) శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్ట్ ట్రంప్ (Donald Trump) తిరస్కరించడంతోపాటు బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేయడంతో పశ్చిమాసియా యుద్ధం (West Asia War) ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి నెలకొన్నది. ఈ క్రమంలో ఇరాన్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Iran vs US : ఇరాన్ (Iran) శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్ట్ ట్రంప్ (Donald Trump) తిరస్కరించడంతోపాటు బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేయడంతో పశ్చిమాసియా యుద్ధం (West Asia War) ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి నెలకొన్నది. ఈ క్రమంలో ఇరాన్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అమెరికాతో తాము అంతిమ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి (Iran foreign Minister) అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు.
అమెరికాతో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించేందుకు తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని, ఒకవేళ అది అంతిమ యుద్ధానికి దారితీసినా తాము ఎదుర్కొంటామని అరాగ్చీ అన్నారు. అదే సమయంలో చర్చలకూ తాము సిద్ధమేనని, ఏది జరగాలన్నది ట్రంప్ చేతిలోనే ఉందని అరాగ్చీ చెప్పారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచే ప్రతిపాదనలను ట్రంప్ బహిరంగంగా తిరస్కరించడంపై ఆయన స్పందించారు. ఈ అంశంపై దౌత్యమార్గాల ద్వారా తమకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదని చెప్పారు.
అక్రమంగా ఫ్రీజ్ చేసిన తమ డబ్బులు, ఆస్తులు తమకు కావాలని అరాగ్చీ డిమాండ్ చేశారు. తమ చమురును తాము అమ్ముకోగలిగే పరిస్థితి ఉండాలన్నారు. ఘర్షణలు తగ్గించేలా చర్చలతో పరిష్కారాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడు తాము హర్మూజ్ను తెరిచేందుకు సుముఖంగానే ఉంటామని అరాగ్చీ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన కింగ్ఫిష్ డ్రోన్ గూఢచర్యానికి పాల్పడుతోందని, దానిని తాము స్వాధీనం చేసుకున్నామని ఇరాన్ ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

