న్యూఢిల్లీ: తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని వీటిని మరింత సులభతరంగా జారీ చేయడానికి రైల్వే చర్యలు చేపట్టింది. పశ్చిమ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్ల జారీ ప్రక్రియలో ఆగస్టు 1నుంచి మార్పులు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
ఇక నుంచి ప్రయాణికులకు టోకెన్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి, కౌంటర్ల వద్ద తోపులాటలను అరికట్టడానికి, టికెట్ల జారీలో పారదర్శకతను తేవడానికి దీనిని ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ఈ కొత్త విధానంతో బుకింగ్స్ క్రమబద్ధీకరణ జరుగుతుందన్నారు.