నగోయా: టీనేజర్ కుమ్కుమ్ మోహద్(Kumkum Mohod) రికార్డు క్రియేట్ చేసింది. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీలో స్వర్ణం గెలిచింది. ఏషియన్ గేమ్స్ ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణి ఓహ్ యోజిన్ను షూటౌట్లో ఓడించింది. శనివారం జరిగిన పోటీల్లో కుమ్కుమ్ అద్భుత ప్రదర్శన ఇచ్చింది. ఏషియన్ గేమ్స్ వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో భారత మహిళా ఆర్చర్‌కు స్వర్ణం రావడం ఇదే మొదటిసారి. స్కోర్లు 5-5తో టై అయిన దశలో.. కుమ్కుమ్ షూటౌట్లో 10 పాయింట్లు సాధించింది. ఇక వత్తిడిలోనైన ప్రత్యర్థి ఓహ్ మాత్రం కేవలం 8 పాయింట్లు మాత్రమే ఆర్జించింది.దీంతో ఇండియన్ ఆర్చర్ కుమ్కుమ్కు గోల్డ్ మెడల్ వశమైంది. తొలుత సెమీఫైనల్లోకి ప్రవేశించడంతో కుమ్కుమ్.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో చైనా క్రీడాకారిణిపై 6-2 తేడా స్కోరుతో కుమ్కుమ్ విక్టరీ కొట్టింది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కోసం కుమ్కుమ్ కోటా కింద ఎంపికైంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 77 మెడల్స్ ఉన్నాయి.
A Golden Milestone for Indian Archery!
Heartiest congratulations to TAGG Athlete Kumkum Anil Mohod on her Gold Medal in the Recurve Women’s Individual event at the #AsianGames2026.
She becomes the first Indian woman to win an individual Gold in Recurve Archery at the Asian… pic.twitter.com/YzECqqJgsX
— Kiren Rijiju (@KirenRijiju) October 3, 2026