School Uniform | నిజామాబాద్, అక్టోబర్ 2, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పేద విద్యార్థి కుటుంబానికి ఉచిత యూనిఫాం అంటే కేవలం ప్రభుత్వ పథకం కాదు. పాఠశాలకు గౌర వంగా వెళ్లే హక్కుతో కూడిన సహాయం. అది సమ యానికి పూర్తి స్థాయిలో సరైన కొలతలో, నాణ్యతతో అందినప్పుడే పథకం నిజమైన అర్థాన్ని సంతరిం చుకుంటుంది. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అందాల్సిన దుస్తులు నెలలు గడిచిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో విద్యార్థు లకు చేరలేదు.
కాంగ్రెస్ పాలనలో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన పిల్ల లకు భరోసా కరువైంది. 2026 27 విద్యాసంవత్సరం మొదలై మూడు నెలలు దాటింది. నేటికీ అనేక చోట్ల ప్రభుత్వ బడుల్లో యూనిఫాం అందజేత పూర్తి కాలేదు. మరోవైపు ఇచ్చిన దుస్తులు చాలా మందికి సరిపోవడం లేదు. కొలతల్లో తేడాలతో ఇబ్బందికి గురవుతున్నారు. చేయి తొడగరా కుండా… కాలు పెట్టడానికి వీలు లేకుండా షర్ట్, ప్యాంట్లు కుట్టించి ఇచ్చేశారు. బట్టల నాణ్యత కూడా సరిగా లేదని పలువురు విద్యార్థుల తల్లిదం డ్రులు వాపోతున్నారు. ఇంత ఘోరంగా యూనిఫాం పంపిణీ జరుగుతుంటే పట్టించుకునే నాథుడే కరువ య్యాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదా రులు ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లాలో సర్కార్ స్కూల్ విద్యార్థులకు అందిన యూనిఫాం విషయంలో శ్రద్ధ చూపకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవు తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 970 ప్రభుత్వ స్కూళ్లలో 66,836 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో యూనిఫాం పంపిణీపై గందరగోళం ఏర్పడింది. జిల్లాలో 1020 ప్రభుత్వ పాఠశాలల్లో 81,039 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రెండు జతల ఉచిత యూనిఫాంలు అందించాల్సి ఉంది.
ఎన్ని పాఠశాలలకు పూర్తి స్థాయి యూనిఫాంలు చేరాయి. సైజుల వారీగా కొలతలు తీసుకున్నారా. తప్పు సైజ్ వచ్చిన విద్యార్థులకు వేరే డ్రెస్ ఇచ్చే విధానం ఉందా? యూనిఫాం నాణ్యతను ఎవరు తనిఖీ చేస్తున్నారు? మహిళా సంఘాలకు కుట్టిం పు బాధ్యత అప్పగించినట్లయితే, కుట్టిన దుస్తు లను ఎవరు నాణ్యతా పరీక్ష చేస్తున్నారు. ఒక జత మాత్రమే అందుకున్న విద్యార్థులకు రెండో జత ఎప్పుడు ఇచ్చారు? ఇవ్వని చోట ఎప్పటిలోగా ఇచ్చే అవకాశం ఉంది? అధికారులు గణాంకాల ప్రకారం పంపిణీ చేసిన దుస్తులకు వాస్తవ పరిస్థితి అద్దం పడుతోందా? అంటే విద్యాశాఖ నుంచి సమాధానమే రావడం లేదు. ప్రైవేటు విద్యాసం స్థల సేవల్లో తరిస్తోన్న ఉన్నతాధికారులకు ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల బాగోగులు మాత్రం పట్టడం లేదు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలను మచ్చిక చేసుకోవడానికి చూపించే చురు కుదనం, ఆసక్తిని ప్రభుత్వ పాఠశాల బాగోగులపై చూపితే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు విన్నవిస్తున్నారు. పేద విద్యార్థులకు పంపిణీ కావా ల్సిన దుస్తుల విషయంలోనూ శ్రద్ద కనబర్చక పోగా కనీసం పర్యవేక్షణ కూడా చేయడం లేదన్న ఆరోపణలు విద్యాశాఖ అధికారులపై వినిపిస్తు న్నాయి. చాలా మంది విద్యార్థులకు కొలతలు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతు న్నాయి. ఒకే సైజును ఎక్కువ మందికి ఇవ్వడం, షర్ట్, ప్యాంట్/స్కర్ట్ పరిమాణాల్లో తేడాలు ఉండటం, కొంత మందికి ఒక జత మాత్రమే అందడం, మరికొందరికి యూనిఫాం పూర్తి సెట్గా అందకపోవడం, ఆలస్యంగా రావడంతో పాత దుస్తులతోనే విద్యార్థులు పాఠశాలలకు రావాల్సి వస్తోంది.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందిం చాల్సిన యూనిఫాంలు విద్యా సంవత్సరం ప్రారం భమై మూడు నెలలు దాటినా పూర్తి స్థాయిలో అంద లేదు. విద్యాశాఖ పనితీరుపై విద్యార్థుల తల్లిదం డ్రులు మండిపడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం విద్యార్థులందరికీ నాణ్యమైన యూనిఫాంలను సకా లంలో అందిస్తామని ప్రకటిస్తుండగా మరోవైపు క్షేత్ర స్థాయిలో మాత్రం కొంత మందికే అరకొరగా దుస్తులు చేరుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబం ధించిన విద్యార్థుల సామాగ్రిని జూన్ 15 నాటికి విద్యార్థులకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలించారు. యూనిఫాంలతో పాటు నోట్ బుక్స్, బ్యాగులు, ఇతర సామాగ్రిని నాణ్యతతో పా టు సకాలంలో చేరాలని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థికి అవసరమైన సామాగ్రి మొత్తం అందిందా? లేదా పరిశీలించాలని, పంపిణీ ప్రక్రియను ఫొటోలు, వీడి యోలతో నమోదు చేయాలని కూడా ప్రభుత్వం సూచించింది. అంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి యూనిఫాం విద్యార్థుల చేతిలో ఉండాల్సి ఉంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కని పిస్తోంది. ఈ విద్యాసంవత్సరం యూనిఫాంల సేక రణలో కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు యూనిఫాంల కుట్టింపు బాధ్యతలు అప్పగించారు. నాణ్యత, పారదర్శకత, ఏకరూపత పెరగాలని ప్రభుత్వంగా ఘనంగా ప్రకటనలు ఇస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో వస్త్రం ఆలస్యంగా రావడం, కుట్టింపులో జాప్యం, పాఠశాలలకు సరఫ రాలో నిర్లక్ష్యం, విద్యార్థులకు పంపిణీ జరగకపో వడం వల్ల సర్కారు ఉద్దేశం నీరుగారుతోంది.