Phone Pe | కాజీపేట, అక్టోబర్ 2: ఇంటి యజమానిని నమ్మించిన కిరాయిదారు లక్ష రూపాయలు కాజేసి ఉడాయించిన వైనం కాజీపేట పట్ట ణంలో ఆలస్యంగావెలుగు చూసింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వేలో ఉద్యోగ విరమణ పొందిన బాష మియా (68) భార్యతో కలిసి కాజీ పేట పట్టణం విష్ణుపురిలో నివాస ముంటున్నారు. కొన్ని నెలల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోను భార్య పిల్లలతో వీరి ఇంట్లో అద్దెకు దిగారు. సోను పట్టణంలో పానీపూరీ వ్యాపారం చేస్తున్నారు. వీరి మధ్య చనువు పెరగడంతో భాషమియాకు ఏమైనా అవసరం వస్తే ఇంట్లో అద్దెకు ఉండే సోనుతో పనులు చేయించునే వాడు.
ఈ నేపథ్యంలో వారం రోజులు బాషమియాకు సోను మద్యం తాగించాడు. బాష మియా మత్తులో ఉండడంతో ఇదే అదనుగా భావించిన సోను ఇంటి యజమాని సెల్‌ఫోన్ తీసుకుని అందులో నుంచి దాదాపు లక్ష రూపాయలు తన ఫోన్‌పేలో పంపించుకున్నాడు. మరుసటి రోజు బాషమియా చూసేసరికి తన అకౌంట్ నుంచి రూ. లక్ష సోను ఫోన్ కు పంపుకున్నట్లు తెలిసింది. వెంటనే సోను కోసం వెతకగా అతడు భార్య, పిల్లలతో కలిసి ఉడాయించాడని తెలిసింది. దీంతో బాషమియా లబోదిబోమంటూ జరిగిన మోసంపై కాజీపేట పోలీస్ స్టేష న్లో ఫిర్యాదు చేశాడు.