హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): హైడ్రా దాని పని అది పర్ఫెక్ట్గా చేస్తున్నదని, కానీ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కొందరు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెలవిచ్చారు. చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కులను కబ్జా పెట్టినోళ్లు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటున్నారని వ్యాఖ్యానించారు. రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశాలివ్వడంపై మంగళవారం ఢిల్లీలో ఆయన స్పందించారు. ‘ఏ అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభు త్వ విచక్షణ అధికారం, ఆ అధికారాన్ని ఎవరూ గుంజుకోలేరు’ అంటూ కోర్టు తీర్పును ధిక్కరించే ధోరణిలో వ్యాఖ్యలు చేశారు.
తద్వారా రంగనాథ్‌ను తొలగించబోమని పరోక్షంగా సంకేతాలిచ్చారనే చర్చ జరుగుతున్నది. అయితే, హైకోర్టు ఆదేశాలను తాను ఇంకా పరిశీలించలేదని, దీనిపై ప్రభుత్వపరంగా సమీక్షిస్తామని తెలిపారు. కోర్టు ఆదేశాలను, న్యాయస్థానాన్ని గౌరవిస్తామని చెబుతూనే.. ప్రస్తుతం హైడ్రా కొనసాగిస్తున్న పనులను కొనసాగిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. అంతేగాక హైడ్రా ఏర్పాటు చేయడం తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత గొప్ప సంస్కరణ(గ్రేటెస్ట్ రిఫా ర్మ్) అని చెప్పుకొచ్చారు. ఓవైపు బాధితులు కన్నీరు పెడుతున్నా, కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను వెనుకేసుకొస్తున్నారు.
హైడ్రా పనితీరును పూర్తి గా సమర్థిస్తున్నారు. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదని, భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని స్పష్టంచేశా రు. అంతేకాదు.. మరింత బలోపేతం చే స్తామని తేల్చిచెప్పారు. హైడ్రా అత్యుత్తమ సంస్థ అని, దేశవ్యాప్తంగా ప్రశంసలు అం దుకున్నదని గొప్పగా చెప్పారు. అంటే భ విష్యత్‌లోనూ హైడ్రా బుల్డోజర్ అకృత్యా లు, పేదల ఇండ్లపై విధ్వంసకాండ మ రింత పెరిగే ప్రమాదం పొంచి ఉన్నదనే సంకేతాలు ఇచ్చినట్టు స్పష్టమవుతున్నది. హైడ్రాను సమర్థిస్తూ ముఖ్యమంత్రి చేసిన తాజా వ్యాఖ్యలతో పేదల్లో మరింత భ యాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పేదలపై హైడ్రా కొనసాగించిన విధ్వంసకాండ ఇంకా కండ్ల ముందే కదలాడుతున్నది. నిర్దాక్షిణ్యంగా పేదల ఇండ్లపై బుల్డోజర్లు ఎగదోయడంతో రోడ్డున పడ్డ కుటుంబాలకు లెక్కలేదు. కానీ ఇవేవీ సీఎం రేవంత్‌రెడ్డికి గుర్తులేనట్టు ఉన్నది. హైడ్రా కేవలం పెద్దలు చేసిన కబ్జాలపై మాత్రమే దాడులు చేసిందని, పేదల ఇండ్లను ముట్టుకోలేదంటూ చెప్పుకొచ్చా రు. పలువురు మంత్రుల ఇండ్లు, సీఎం సోదరుడి ఇండ్లు, పలు బడా రియల్ ఎ స్టేట్ సంస్థల కట్టడాలు బఫర్జోన్లలో ఉ న్నాయనే ఆరోపణలున్నాయి. వాటిపై హైడ్రా కన్నెత్తి చూడటం లేదని, వాటిపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కానీ వీటిపై మాత్రం సీఎం స్పందించలేదు. హైడ్రా కార్యాచరణ, బా ధ్యతలపైనా ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉన్నదని పేర్కొన్నారు. అంటే హైడ్రా చేసే ప్రతి పనీ ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందని ఆయన పరోక్షంగా అంగీకరించారు.
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రతిపక్షాలతోపాటు బీసీ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించడంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఏపీలోనూ రూ.10వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, మరి అక్కడెందుకు ప్రశ్నించడంలేదని ఎదురు ప్రశ్న వేశారు. ముందు అక్కడ ప్రశ్నించాలని తప్పించుకొనే ధోరణిలో మాట్లాడారు. ఇక రాష్ట్రం లో ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు కొట్టేయాలనుకున్న విద్యాసంస్థలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్నదని తెలిపా రు. భవిష్యత్‌లో ఏ సంవత్సరం ఫీజును అదే ఏడాది చెల్లిస్తామని స్పష్టంచేశారు. బ్యాంక్ ఖాతాలో అడ్వాన్స్ పెడుతున్నామని, ఏటా రూ.2,200 కోట్ల నుంచి రూ.2,400 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశామని తెలిపారు. క్రమం తప్పకుండా ఫీజులు చెల్లించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని, భవిష్యత్‌లో సమస్య ఉండదని చెప్పారు.