పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

- పాఠశాలలో చెత్తాచెదారంపై డీఈవో ఆగ్రహం
- కమిటీలు ఎందుకు వేయలేదని ప్రధానోపాధ్యాయుడిపై మండిపాటు
పరిగి, జనవరి 28 : పాఠశాలలో చెత్తాచెదారం ఉండడంపై జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పరిగి జడ్పీహెచ్ఎస్ నెం.1 ప్రధానోపాధ్యాయుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పరిగిలోని జడ్పీహెచ్ఎస్ నెం.1, గాన్సలో గార్సియా పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదులను డీఈవో పరిశీలించారు. వరండా, గదుల్లో చెత్తాచెదారం ఉండడంపై డీఈవో మండిపడ్డారు. గదులన్నీ శుభ్రం చేయించాలని ఆదేశించారు. పాఠశాలలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తెరువనున్న నేపథ్యంలో గదులన్నీ శుభ్రం చేయించాలన్నారు. ప్రభుత్వం సూచించిన మేరకు పాఠశాలలో కమిటీలు ఎందుకు వేయలేదని ప్రధానోపాధ్యాయుడిపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో శానిటైజేషన్, అవసరాల కమిటీ, మధ్యాహ్న భోజన కమిటీ, అకడమిక్ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. విద్యార్థులు తరగతి గదిలోకి ఒక మార్గం ద్వారా రావడంతోపాటు మరో మార్గం ద్వారా బయటకు వెళ్లేలా ఏర్పాటు చేయాలన్నారు. పిల్లలను పాఠశాలకు పంపిస్తామని తల్లిదండ్రుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాల్సిందిగా సూచించారు. మధ్యాహ్న భోజన సమయంలోనూ విద్యార్థులందరినీ ఒకేసారి కాకుండా విడుతల వారీగా భోజనం చేసేలా చూడాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆమె చెప్పారు. ఆదేశాలు బేఖాతరు చేస్తే చర్యలు తప్పవని డీఈవో హెచ్చరించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి హరిశ్చందర్, జడ్పీహెచ్ఎస్ నెం.1 ప్రధానోపాధ్యాయుడు అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కళ్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు
- షాకింగ్ : పక్కదారి పట్టిందనే ఆగ్రహంతో భార్యను హత్య చేసి..
- క్రికెట్లో ఈయన రికార్డులు ఇప్పటికీ పదిలం..
- పవన్ కళ్యాణ్‌తో జతకట్టిన యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్
- వీడియో : గంటలో 172 వంటకాలు
- ఫలక్‌నుమాలో భారీగా లభించిన పేలుడు పదార్థాలు
- ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి.. ఇప్పుడిలా..
- క్రేన్ బకెట్ పడి ఇద్దరు రైతుల దుర్మరణం
- మరో కీలక నిర్ణయం : ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
- ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఆఫీసుకెళ్లిన సీఎం మమతా బెనర్జీ.. వీడియో