హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ అత్యంత చీప్ ఆరోపణ అని, తాము సీఎంపై అలాంటి ఆరోపణలు చేయబోమని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం టీవీ 9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికైనా, ఏ రాష్ర్టానికైనా నిఘా వ్యవస్థలు, వేగులు ఉండటం అత్యంత సహజమని, నేరాలను అరికట్టే చర్యల్లో భాగంగా ఇంటెలిజెన్స్ విభాగం ఫోన్ ట్యాపింగ్ లాంటివి చేయడం సహజమని వివరించారు. దీంతో ముఖ్యమంత్రికీ, మంత్రులకు ఎటువంటి సంబంధం ఉండదని స్పష్టంచేశారు. ప్రస్తుత ప్రభుత్వం బుర్ర తక్కువ ప్రభుత్వమని, అందుకే దీనిని రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు.
జవాబు: సమాచార సేకరణ నిమిత్తం ప్రభుత్వాల దగ్గర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అందులో కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ, ఎస్బీఐ ఇలా వివిధ విభాగాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికైనా, ఏ రాష్ర్టానికైనా అనేక స్థాయిల్లో నిఘా వ్యవస్థ, వేగులు ఉండటం అత్యంత సహజమైన విషయం. వాళ్లకు ప్రభుత్వాలు రహస్యంగా నిధులు ఇస్తాయి. నేర నిరోధక విభాగం కాబట్టి, ముందే సమాచారం సేకరించేందుకు అనేక మార్గాలు ఎంచుకుంటారు. అవసరమైతే, ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటే చేస్తారు. టెలిగ్రాఫిక్ యాక్ట్- 1898 ప్రకారం ప్రభుత్వాలకు, పోలీసులకు ఆ అధికారాలు ఉంటాయి. దీనికి సీఎం, మంత్రులకు సంబంధం ఉండదు. హోంశాఖ మంత్రి స్థాయిలోనే ఉంటుంది. హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకొని బాజాప్తా ఇంటర్సెప్ట్ (ట్యాపింగ్) చేస్తరు. ఇవి ముఖ్యమంత్రికి తెలియదు. అవసరమైతే సీఎంలు కొన్ని రిపోర్టులు అడుగుతారు. ఇవి పూర్తిగా పరిపాలనా సంబంధమైన అంశాలు. ఇప్పుడున్న ప్రభుత్వం బుర్ర తక్కువ ప్రభుత్వం కాబట్టి దానిని కూడా రాజకీయం చేసింది.
జవాబు: నా దృష్టికి వచ్చిన మేరకు పూర్తిగా చట్టపరంగా జరిగింది. ఎవరైనా అధికారి అక్రమంగా చేస్తే, ఆ సంగతి డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అలాంటి దుర్మార్గమైన పనిచేస్తే శిక్ష అనుభవిస్తారు. దానికి పొలిటికల్ ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పోలీసులు తమ అవసరాల నిమిత్తం ఏ పరికరాలు కొన్నారు? ఏ వస్తువులు వాడారు? వంటివి మాకు తెలియదు. సీఎం ఆ పని పట్టించుకోరు. అది పోలీసుల అంతర్గత వ్యవహారం. డీజీపీ, హోం సెక్రెటరీ వంటివారి పని. వాళ్ల పని అడుతుగం, పనితీరు చూస్తం, బడ్జెట్ సపోర్ట్ చేస్తాం. అంతే. రాజకీయ అవసరాల కోసం ఇంటర్సెప్షన్ను వాడుకున్నామో లేదో నాకు తెలియదు. నాకు రిపోర్టులు మాత్రమే వస్తాయి. చాలా విషయాల మీద రిపోర్టులు అడుగుతాం. పోలీసులు కొన్ని ఆటోమేటిక్‌గా ఇస్తారు. దీనిని ఏదో ప్రపంచం మునిగిపోతున్నదన్నట్టు రాజకీయం చేయడం సరికాదు.
జవాబు: ఇప్పుడున్న సీఎం తన స్థాయిని దిగజార్చుకుంటాడేమో కానీ.. నేను దిగజారను. అలాంటి చీప్ ఆరోపణలను సీఎం మీద పెట్టదలుచుకోలేదు.
జవాబు: ఇది సిల్లీ, థర్డ్ క్లాస్ ఆరోపణ. లా అండ్ ఆర్డర్ కాపాడటానికి, ప్రతీప శక్తులను అడ్డుకోవడానికి పలు మార్గాల్లో సమాచారం సేకరిస్తుంటారు. అందులో ఇంటర్సెప్షన్ ఒకటి. అది అధికారికంగా చేస్తారు. అవసరమైతే, నెట్వర్క్ కంపెనీలను కూడా అడుగుతారు. అంతేకానీ, ‘ఫలానా వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసినం’ అని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పరు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కూడా రోజూ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ వస్తుంది. దీనిని కూడా రాజకీయం చేయడమంత దివాళాకోరుతనం ఇంకోటి ఉండదు.