e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home News బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!

బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!

బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!

చాలా మంది కొంచెం లావు అయితే చాలు అయ్యో చాలా లావు అయిపోయామని హైరానా పడిపోతుంటారు. శరీరం నాజుగ్గా ఉంచుకోవడం కోసం కొంత మంది ప్రయత్నిస్తే.. మరి కొంతమంది ఆరోగ్యం కోసమంటారు. ఇంకొంత మంది సెక్సీగా కనబడటానికి అంటుంటారు. వయసుకు మించిన బరువు ఉండటం మన ఆరోగ్యానికి హానికరం. ఇందుకోసం తిండి మానేస్తుంటారు. డైటింగ్ చేస్తుంటారు. ఫలితంగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు. డైటింగ్‌ చేయకుండా, తిండి మానేయకుండా శరీరం బరువు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి.

బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!

ఆహారంలో ఉప్పు, చక్కెరను వీలైనంత తక్కువగా వాడేలా చూసుకోవాలి. ఇది శరీరం బరువు కోల్పోయే ప్రక్రియను సులభతరం చేస్తుంది. మార్పులు కూడా త్వరగా కనిపిస్తాయి. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిలుపుకునే సమస్య ఏర్పడి శరీరంలో వాపు సమస్య వస్తుంది. ధాన్యాల కన్నా చక్కెరలు మన శరీరంలో కొవ్వును ఐదు రెట్లు వేగంగా పెంచుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. అందుకని ఉప్పు, చక్కెరలు తగ్గించడం ద్వారా శరీరం బరువును తగ్గించుకోవచ్చు.

బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
- Advertisement -

నీరు దివ్యౌషధం. ఎంత ఎక్కువగా నీరు తాగితే అంత ఆరోగ్యంగా ఉంటాం. సాధారణంగా డ్రింక్స్ అంటే మనలో చాలా మంది ఎక్కువగా పంచదార కలపిన జ్యూసులు, సోడా, ఎనర్జీ డ్రింక్స్ తాగడంపై ఆధారపడతారు. దాంతో శరీరంలో అదనంగా మరి కొంత కొవ్వు ఏర్పడుతుంది. అలా కాకుండా నీళ్ళను ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి. నీళ్లు తాగడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్సు ఉండవు. రక్తంలోని సోడియం నిల్వలు పల్చబడతాయి. అయితే, ఒకేసారి ఎక్కువగా తాగకుండా.. కొంచెం కొంచం తాగుతూ ఉండాలి.

బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!

సరైన ఆహారాన్ని సరైన సమయానికి తినడం కూడా మనకు ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. తినే సమయాన్ని సరిచేయడం ద్వారా ఆ సమయంలో ఆకలిని నియంత్రించగలుగుతాం. తినే సమయాలను నిర్ణయించకపోతే ఏదైనా తినడం అలవాటు అవుతుంది. దీనివల్ల కొవ్వు పెరుగుతుంది. అలాకాకుండా నిత్యం ఒకే సమయానికి తినడం అలవాటు చేసుకోవాలి. ప్లేట్‌లో సమతుల్య ఆహారం ఉండేలా చూడాలి. నిత్యం పండ్లు తినడం చాలా మంచిది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల ఆకలి వేయకుండా శరీరం బరువు తగ్గించుకోవచ్చు.

బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!

ఇక నిద్ర కూడా మన శరీరం బరువును నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. నిద్ర లేకపోవడం ఊబకాయానికి దారితీస్తుంది. అలాగే దినచర్యను పాడు చేస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో బరువును నియంత్రించే లెప్టిన్ అనే హార్మోన్ స్థాయి తగ్గుతుంది. ఊబకాయం వేగంగా పెరుగుతుంది. అందుకని ప్రతిరోజూ 6 నుంచి 7 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.

బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!

శరీరం బరువు తగ్గించుకోవడంలో వ్యాయామానికి పెద్ద పాత్ర ఉన్నది. అందుకని వ్యాయమం చేయడాన్ని మిస్సవ్వద్దు. రన్నింగ్, జాగింగ్, స్కిప్పింగ్ వంటి వ్యాయామాలు.. శరీరం బరువు తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి. ప్రభావం కూడా చాలా వేగంగా ఉండి ఎక్కువ కాలం ఉంటుంది. దుమ్ము దులపడం, కడగడం, తోట పని చేయడం, నీళ్లు నింపడం వంటి ఇంటి పనులను చేయడం ద్వారా చాలా క్యాలరీలు కరిగించుకోవచ్చు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఆఫ్ఘాన్‌లో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేస్తాం : తాలిబాన్‌ ప్రకటన

చైనాలో ఒక రోజు ముందుగా యోగా దినోత్సవం

ఫాదర్స్‌ డే నాడే తండ్రిని చంపిన తనయుడు.. ఎందుకంటే..?

కరోనాకు గురై టీఎంసీ ఎమ్మెల్యే కన్నుమూత

రిగ్గింగ్‌ జరిగిందంటూ కోర్టును ఆశ్రయించిన టీఎంసీ అభ్యర్థులు

రామ మందిరం విషయంలో మా ఎంపీవన్నీ అబద్దాలే

ఏడు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర క్యాబినెట్‌లో మార్పులు..!

చరిత్రలో ఈరోజు : ఈ అందమైన రైల్వే స్టేషన్‌కు 134 ఏండ్లు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!

ట్రెండింగ్‌

Advertisement