e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News ఏడు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర క్యాబినెట్‌లో మార్పులు..!

ఏడు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర క్యాబినెట్‌లో మార్పులు..!

ఏడు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర క్యాబినెట్‌లో మార్పులు..!

న్యూఢిల్లీ : ఏడు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తుండటంతో అక్కడ విజయం సాధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నది. అందుకుగాను కేంద్ర మంత్రిమండలిలో మార్పులు చేపట్టి ఆయా రాష్ట్రాల నాయకులకు అవకాశమిచ్చేందుకు సన్నద్ధమవుతున్నది. పార్లమెంట్ వర్షకాల సమావేశాల సందర్భంగా మంత్రి మండలిలో మార్పులు, చేర్పులు చేపట్టాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది.

వచ్చే ఏడాది చివర్లో 7 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ఉత్సాహం ఆయా రాష్ట్రాల కంటే ఢిల్లీలోనే ఎక్కువగా కనిపిస్తున్నది. కేంద్ర క్యాబినెట్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పునర్‌వ్యవస్థీకరణ ఈ ఎన్నికలతోపాటు రాబోయే రెండేండ్లలో రాజకీయ పరిణామాలకు సిద్ధమవుతున్నది. కేంద్రంలో చాలా మంది మంత్రులు 3 నుంచి 4 విభాగాల పనిని చూసుకుంటున్నారు. దాంతో పనులు ఆలస్యంగా జరుగడం, మంత్రులపై ఒత్తిళ్లు పెరుగుతుండటంతో క్యాబినెట్ విస్తరణ అనివార్యంగా కనిపిస్తున్నది.

- Advertisement -

క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో 6-7 కొత్త ముఖాలకు అవకాశం దొరకొచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే, పలువురు మంత్రుల శాఖలు కూడా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ పునర్‌వ్యవస్థీకరణలో 24 మంత్రిత్వ శాఖలను మార్చడానికి చాలా విస్తృతంగా చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదే విషయంపై చర్చించేందుకు ఈ నెలలోనే 4 పెద్ద సమావేశాలు ప్రధాని నివాసంలో జరిగాయి. పార్టీ పెద్దలతో, మిత్రపక్షం నేతలతో సంప్రదింపులు జరిగాయి. జూలై రెండవ పక్షంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు జూన్ చివరి నాటికి క్యాబినెట్‌ను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వచ్చే ఏడాది జరుగనున్న 7 రాష్ట్రాలకు గాను ఆరింటిలో బీజేపీ తన ప్రభుత్వాలను కాపాడుకోవాలి. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. యూపీ మినహా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. కాంగ్రెస్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఈ రాష్ట్రాలకు కేంద్ర క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం పెంచేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ముందుగా ఎన్నికలు జరగనున్న యూపీ, పంజాబ్‌ రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కరోనా కారణంగా తమ బలమైన కోటను కాపాడటానికి కష్టపడాల్సిన యూపీ బీజేపీకి అతిపెద్ద సవాలుగా నిలువనున్నది. బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవచ్చు.

మహారాష్ట్ర నుంచి దేవేంద్ర ఫడ్నవీస్‌కు అవకాశాలు ఉన్నాయి. వీరితోపాటు అసోం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ పేరు కూడా ఉన్నది. స్మృతి ఇరానీకి ముఖ్యమైన బాధ్యత ఇవ్వడం, అనిల్ బలూని, మీనాక్షి లేఖీని ప్రభుత్వంలో తీసుకురావడం గురించి చర్చ జరుగుతున్నది. అప్నాదళ్‌ అధినేత అనుప్రియా పటేల్‌, జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద కూడా మంత్రి పదవుల ఆశతో ఉన్నారు.

ఈ మంత్రులపై రెట్టింపు భారం

రహదారి రవాణా, జాతీయ రహదారులతో పాటు నితిన్ గడ్కరీకి ఎంఎస్‌ఎంఈ శాఖ ఉన్నది.

నరేంద్ర తోమర్ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి.

స్మృతి ఇరానీ టెక్స్‌టైల్‌ మంత్రిత్వ శాఖతోపాటు మహిళలు, శిశు అభివృద్ధిని చూసుకుంటున్నారు.

డాక్టర్ హర్ష్‌వర్ధన్ ఆరోగ్యంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను కలిగి ఉన్నారు.

ప్రకాష్ జవదేకర్ వద్ద పర్యావరణం, భారీ పరిశ్రమలతోపాటు సమాచార-ప్రసారాల శాఖ ఉన్నది.

ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలియం శాఖ కాకుండా ఉక్కు శాఖను కూడా చూస్తున్నారు.

న్యాయ శాఖతోపాటు రవిశంకర్ ప్రసాద్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

చరిత్రలో ఈరోజు : ఈ అందమైన రైల్వే స్టేషన్‌కు 134 ఏండ్లు

ఇవీ మిల్కాసింగ్ ఆరోగ్య సూత్రాలు..!

చ‌రిత్ర‌లో ఈరోజు : హిందుత్వానికి ప్ర‌తీక‌గా శివసేన ఆవిర్భావం

కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా అమెరికా మరో అడుగు

కిడ్నీ క్యాన్స‌ర్ ఎలా వ‌స్తుందంటే..?

మూడో అతిపెద్ద వ‌జ్రం దొరికింది.. ఎక్క‌డంటే..?

యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాక‌ర‌ణ‌

అంత్య‌క్రియ‌ల వేళ త‌ల్లి మాట విని లేచిన కొడుకు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఏడు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర క్యాబినెట్‌లో మార్పులు..!
ఏడు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర క్యాబినెట్‌లో మార్పులు..!
ఏడు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర క్యాబినెట్‌లో మార్పులు..!

ట్రెండింగ్‌

Advertisement