e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News కిడ్నీ క్యాన్స‌ర్ లక్షణాలివే..

కిడ్నీ క్యాన్స‌ర్ లక్షణాలివే..

కిడ్నీ క్యాన్స‌ర్ లక్షణాలివే..

శరీరంలోని సున్నితమైన, ముఖ్య అవయవాల్లో కిడ్నీలు ఒకటి. మన రక్తంలోని మలినాలను వడకడుతూనే శరీరానికి అత్యంత రక్షణ కలిగిస్తాయి. శరీరంలో అతిముఖ్యమైన ఈ అవయవాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్తం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో, శరీరంలో నీరు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, క్లోరైడ్, పాస్ఫరస్ వంటి పదార్థాలను సమపాళ్ళుగా ఉంచుతుంది. శరీరంలో ద్రవాల స్థాయిలను నియంత్రించడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తేనే ఇతర అన్ని అవయవాల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అంత‌టి ప్రాధాన్యం ఉన్న మూత్రపిండాల‌కు క్యాన్స‌ర్ సోకితే.. ఎలా గుర్తించాలి..? ఎలాంటి చికిత్స పొందాలి..? అనే విష‌యాల‌ను ప్ర‌పంచ కిడ్నీ క్యాన్స‌ర్ డే సంద‌ర్భంగా తెలుసుకుందాం.

కిడ్నీ కాన్సర్ ఎందుకు వస్తుందో చెప్ప‌లేమంటున్నారు వైద్య నిపుణులు. స్త్రీలకు, చిన్న‌ వయసు వారికీ ఈ కాన్సర్ రాదని కాదు కానీ, 50-70 సంవత్సరాల మధ్య ఉన్న పురుషుల్లో ఈ కాన్సర్ ఎక్కువగా క‌నిపిస్తుంది. కుటుంబం లో ఎవరికైనా కిడ్నీ కాన్సర్ ఉండటం, డయాలసిస్ ట్రీట్మెంట్, హైబీపీ, ఒబేసిటీ, సిగరెట్ స్మోకింగ్ అలవాటు, పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్, కొన్ని మెడిసిన్స్ ఎక్కువగా వాడటం, కొన్ని రకాల జెనెటిక్ కండిషన్స్ ఉన్న‌వారిలో కిడ్నీ క్యాన్స‌ర్లు క‌నిపిస్తుంటాయ‌ని వైద్యులు చెప్తున్నారు.

కిడ్నీ క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలు

కిడ్నీ క్యాన్స‌ర్ లక్షణాలివే..
- Advertisement -

యూరిన్ లో రక్తం పడడం, లో బ్యాక్ పెయిన్ (ఒక వైపు మాత్రమే), లోయర్ బ్యాక్ లో ఏదైనా గడ్డ, ఆకలి లేకపోవడం, ఎలాంటి ప్రయత్నాలు లేకుండా వెయిట్ లాస్ జరగడం, ఎలాంటి ఇన్‌ఫెక్షన్స్ లేకుండా జ్వరం రావడం, తగ్గకపోవడం, ఎనీమియా.. వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

అందుబాటులో ఉన్న చికిత్స‌..

కిడ్నీ క్యాన్స‌ర్లను నివారించేందుకు కెమోథెర‌పీ, రేడియేష‌న్ థెర‌పీ, టార్గెటెడ్ థెర‌పీ, బ‌య‌లాజిక‌ల్ థెర‌పీ, స‌ర్జ‌రీ ప‌ద్ధ‌తులు అందుబాటులో ఉన్నాయి. ఈ ర‌కం క్యాన్స‌ర్ల‌ను త్వ‌ర‌గా గుర్తించ‌డం వ‌ల్ల ఇత‌ర అవ‌య‌వాల‌కు పాక‌కుండా చూడొచ్చు. కిడ్నీ ప‌నితీరు మెరుగుప‌ర్చుకునేదుకు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పండ్లు, కూరగాయలు, పూర్తి ధాన్యాలు, లీన్ చికెన్, ఫిష్, లేదా సోయా వంటి హై బయలాజికల్ వాల్యూ ప్రొటీన్ ఉన్న ఆహార పదార్ధాలు తీసుకోవాలి. ఈ వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌వారు ద్ర‌వాలు త‌క్కువ‌గా తీసుకోవాలి. ఉప్పును పూర్తిగా త‌గ్గించాలి. త‌క్కువ మొత్తంలో ఆహారం ఎక్కువ సార్లు తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయ‌డం మ‌రిచిపోవ‌ద్దు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఈ మామిడి పండ్లు చాలా కాస్ట్‌లీ గురూ..!

మూడో అతిపెద్ద వ‌జ్రం దొరికింది.. ఎక్క‌డంటే..?

కరోనా పుట్టినిల్లు.. వుహాన్‌లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ?

యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాక‌ర‌ణ‌

అంత్య‌క్రియ‌ల వేళ త‌ల్లి మాట విని లేచిన కొడుకు

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..

చ‌రిత్ర‌లో ఈరోజు.. ముంతాజ్‌ జ్ఞ‌ప్తిగా తాజ్‌మ‌హ‌ల్ నిర్మాణం

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ : ఒక్క మ్యాచ్‌తో విజేత‌ను నిర్ణ‌యించ‌డం సరికాదు : స‌చిన్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కిడ్నీ క్యాన్స‌ర్ లక్షణాలివే..
కిడ్నీ క్యాన్స‌ర్ లక్షణాలివే..
కిడ్నీ క్యాన్స‌ర్ లక్షణాలివే..

ట్రెండింగ్‌

Advertisement