e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..

తాజాగా ప్ర‌క‌టించిన‌ ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్ మ‌రోసారి తొలి స్థానాన్ని ఆక్ర‌మించుకున్నాడు. టీమిండియా సార‌ధి విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి చేరుకోగా.. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఇద్ద‌రూ 747 పాయింట్ల‌తో ఆరో స్థానంలో నిలిచారు. బౌలింగ్ విభాగంలో అశ్విన్‌కు రెండో స్థానం ద‌క్కింది. ఆల్‌రౌండ‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా రెండో స్థానంలో నిలిచారు.

డిసెంబరు తర్వాత తొలిసారిగా అగ్రస్థానానికి ఎదిగిన స్మిత్.. గత ఏడాది భారత్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ తర్వాత తొలిసారిగా అగ్రస్థానంలో నిలిచాడు. స్మిత్‌ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను అధిగమించాడు. గాయం కారణంగా విలియమ్సన్ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. దాంతో స్మిత్ కంటే ఐదు రేటింగ్ పాయింట్లను కోల్పోయి రెండవ స్థానంలో నిలిచాడు. స్మిత్‌కు 891 రేటింగ్ పాయింట్లు, కోహ్లీకి 814 పాయిట్లు ఉన్నాయి. స్టీవ్ స్మిత్ మొత్తం 167 టెస్టులు ఆడి అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ విషయంలో అతను వెస్టిండీస్ గ్యారీ సోబర్స్ (189 మ్యాచ్‌లు), వివ్ రిచర్డ్స్ (179 పాయింట్లు) వెనుక ఉన్నాడు. భారత్‌తో సిరీస్ లేకపోవడంతో అతను నంబర్ 1 ర్యాంకింగ్‌ను కోల్పోవలసి వచ్చింది. కాగా, క్వింటన్ డీ కాక్.. చేతేశ్వర్ పుజారాతో కలిసి 12 వ స్థానానికి చేరుకున్నారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఐదుగురు, భార‌త్‌కు చెందిన ముగ్గురు ఉండ‌గా, ఇంగ్లండ్, పాకిస్తాన్ నుంచి ఒక్కొక్క‌రు చొప్పున ఉన్నారు.

- Advertisement -

ఇక టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ రెండో స్థానం పొందాడు. సీనియర్ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (850 పాయింట్లు) ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమ్మిన్స్ (908 పాయింట్లు) వెనుక ఉన్నాడు. టాప్ 10 బౌలర్లలో అశ్విన్ ఒక్క‌డే భారతీయుడు. వెస్టిండీస్ జాసన్ హోల్డర్ 412 రేటింగ్ పాయింట్లతో టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్‌కు చెందిన రవీంద్ర జడేజా (386 పాయింట్లు), అశ్విన్ (353 పాయింట్లు) వరుసగా రెండో, నాలుగో స్థానంలో ఉన్నారు.

న్యూజిలాండ్ పేసర్ మాట్ హెన్రీ కెరీర్-బెస్ట్ 307 పాయింట్ల 64 వ స్థానానికి చేరుకోగా, ఎజాజ్ పటేల్ కూడా కెరీర్లో అత్యధికంగా 323 పాయింట్లు సాధించాడు. డెవాన్ కాన్వే 61 వ స్థానం పొందాడు.

ఇవి కూడా చ‌ద‌వండి..

చ‌రిత్ర‌లో ఈరోజు.. ముంతాజ్‌ జ్ఞ‌ప్తిగా తాజ్‌మ‌హ‌ల్ నిర్మాణం

కొత్తిమీర‌-పుదీనా ప‌చ్చ‌డితో 7 ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు.. ఏవంటే..?

ఈ టెక్నాలజీతో ఎన్-95 మాస్క్‌లు, పీపీఈ కిట్ల‌ రీయూజ్ సాధ్యం..!

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ : ఒక్క మ్యాచ్‌తో విజేత‌ను నిర్ణ‌యించ‌డం సరికాదు : స‌చిన్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..

ట్రెండింగ్‌

Advertisement