చ‌రిత్ర‌లో ఈరోజు.. ముంతాజ్‌ జ్ఞ‌ప్తిగా తాజ్‌మ‌హ‌ల్ నిర్మాణం

త‌న భార్య ముంతాజ్‌కు జ్ఞ‌ప్తిగా ఆగ్రాలో తాజ్‌మ‌హ‌ల్ నిర్మాణ ప‌నుల‌ను షాజ‌హాన్‌ 1631 స‌రిగ్గా ఇదే రోజున ప్రారంభించారు. ముంతాజ్ మ‌ర‌ణించిన ఏడు నెల‌ల త‌ర్వాత ఈ మ‌హ‌ల్ నిర్మాణ ప‌నుల‌ను చేప‌ట్టారు. తాజ్‌మ‌హల్ పూర్తికావ‌డానికి దాదాపు 22 సంవ‌త్స‌రాల స‌మ‌యం ప‌ట్టింది. కుమార్తెకు జన్మనిచ్చిన అనంత‌రం అదే రోజున ముంతాజ్ మరణించింది. ఆ సమయంలో డెక్కన్‌కు చెందిన ఖాన్ జహాన్ లోధి షాజహన్‌పై తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటును ఎదుర్కోవటానికి షాజహాన్ ప్రయాణంలో ఉన్నాడు. ముంతాజ్ కూడా అతనితో ఉన్నారు. ఆమె మరణానంతరం ముంతాజ్‌ను మధ్యప్రదేశ్‌లోని బుర్హనుపార్‌లోని తప్తీ నది ఒడ్డున ఖననం చేశారు.

షాజహాన్‌ను నాలుగు వాగ్దానాలను నెరవేర్చమని ముంతాజ్ కోరినట్లు చ‌రిత్ర‌కారులు చెప్తుంటారు. అందులో ఒకటి త‌న మరణానంతరం జ్ఞాపకార్థం ఒక గొప్ప భవనం నిర్మించడం. ఖాన్ జహాన్ లోధితో యుద్ధం త‌ర్వాత‌ షాజహాన్ ఆగ్రాకు చేరుకుని ముంతాజ్‌కు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం ఆగ్రాలోని యమునా నది ఒడ్డున ఒక గొప్ప సమాధిని నిర్మించడం ప్రారంభించాడు.

దీని నిర్మాణం కోసం విలువైన రాళ్ళు, రత్నాలను ప్రపంచం నలుమూలల నుంచి తెప్పించారు. ప‌గ‌లు, రాత్రిళ్లు ప‌నిచేయ‌డంతో దాదాపు 22 సంవ‌త్సార‌ల త‌ర్వాత తాజ్‌మ‌హ‌ల్ నిర్మాణం పూర్తయింది. తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటిగా పరిగణించబడుతున్న‌ది. యునెస్కో ఈ భవనాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ప్రతి ఏటా తాజ్‌మహల్ అందాలను వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి 1.5 లక్షల మంది పర్యాటకులు ఆగ్రాకు వస్తారు.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2012: మూడోసారి ఇండోనేషియా ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచిన సైనా నెహ్వాల్

1991: రాజీవ్ గాంధీకి మరణానంతరం భారత‌రత్న ప్రదానం

1963: పాఠశాలల్లో బైబిల్ చదవడాన్ని నిషేధించిన యూఎస్ సుప్రీంకోర్టు

1961: ఆకాశంలో విహ‌రించిన భారతదేశంలో తయారు చేసిన మొదటి యుద్ధ విమానం

1947: రిపబ్లిక్ గా ప్రకటించికున్న బ‌ర్మా

1885: న్యూయార్క్ చేరుకున్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ

1839: భారత గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ మరణం

1799: ఇటలీని తన సామ్రాజ్యంలో చేర్చుకున్న నెపోలియన్ బోనపార్టే

ఇవి కూడా చ‌ద‌వండి..

కొత్తిమీర‌-పుదీనా ప‌చ్చ‌డితో 7 ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు.. ఏవంటే..?

ఈ టెక్నాలజీతో ఎన్-95 మాస్క్‌లు, పీపీఈ కిట్ల‌ రీయూజ్ సాధ్యం..!

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ : ఒక్క మ్యాచ్‌తో విజేత‌ను నిర్ణ‌యించ‌డం సరికాదు : స‌చిన్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..