Saini S Johray | ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ డిజైనర్ సైనీ ఎస్ జోహ్రాయ్పై చండీగఢ్‌లోని సెక్టార్-17 పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బాధితురాలైన ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. అయితే, ఈ కేసు నమోదైన వెంటనే సైనీ జోహ్రాయ్ జిల్లా కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. ఈ ఆరోపణలపై సైనీ జోహ్రాయ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం… నిందితుడు తనను ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు పిలిపించుకుని, అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఆపడానికి ప్రయత్నించినప్పుడు తనపై దాడి చేసి, బందీగా ఉంచాడని తెలిపారు. అంతేకాకుండా సైనీ జోహ్రాయ్ తన డ్రింక్‌లో ఏదో అనుమానాస్పద మత్తుపదార్థాన్ని కలిపాడని, అది తాగిన తర్వాత తన ఆరోగ్యం క్షీణించిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు గత నెల కేసు నమోదు చేసినప్పటికీ ఈ విషయం మే 25 సోమవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సైనీ ఎస్ జోహ్రాయ్ బాలీవుడ్లో ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్‌గా గుర్తింపు పొందారు. మనోజ్ బాజ్‌పాయ్ నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్ నటించిన ‘ది నైట్ మేనేజర్’ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లకు ఆయన పనిచేశారు. అలాగే, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటిస్తున్న భారీ చిత్రం ‘ధురంధర్’కు కూడా ఆయనే ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించాడు.