Malaika Arora | అర్జున్ కపూర్ తర్వాత మలైకా జీవితంలోకి కొత్త వ్యక్తి .. వ్యాపారవేత్తతో డేటింగ్ రూమర్లు వైరల్!
Malaika Arora | బాలీవుడ్ గ్లామర్ క్వీన్ మలైకా అరోరా మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. ఐదు పదుల వయసులోనూ తన ఫిట్నెస్, గ్లామర్‌తో యువ హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తున్న ఈ బ్యూటీ.. సినిమాల కంటే ఎక్కువగా తన వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారాల కారణంగానే తరచూ వార్తల్లో కనిపిస్తుంటారు.
Malaika Arora | బాలీవుడ్ గ్లామర్ క్వీన్ మలైకా అరోరా మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. ఐదు పదుల వయసులోనూ తన ఫిట్నెస్, గ్లామర్‌తో యువ హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తున్న ఈ బ్యూటీ.. సినిమాల కంటే ఎక్కువగా తన వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారాల కారణంగానే తరచూ వార్తల్లో కనిపిస్తుంటారు.కొన్నేళ్ల పాటు నటుడు అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉన్న మలైకా, ఇటీవల అతనితో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె జీవితంలో కొత్త వ్యక్తి వచ్చారంటూ బాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. మలైకా అరోరా ప్రముఖ డైమండ్ వ్యాపారవేత్త హర్ష్ మెహతాతో డేటింగ్ చేస్తున్నారనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవల పలుచోట్ల వీరిద్దరూ ఒకే సమయంలో కనిపించడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. సంగీత కార్యక్రమాలు, విమానాశ్రయం వంటి ప్రదేశాల్లో ఇద్దరూ విడివిడిగా కనిపించినప్పటికీ.. ఒకే ఈవెంట్‌కు హాజరయ్యారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు చర్చకు దారితీశాయి. తాజాగా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో మలైకా అరోరా తన కుమారుడు అర్హాన్ ఖాన్‌తో కలిసి పాల్గొన్నారు. అదే కార్యక్రమానికి హర్ష్ మెహతా కూడా హాజరైనట్లు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందనే వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి.
అయితే ఈ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి మీడియా ముందుకు రాకపోయినా, ఒకే వేదికపై కనిపించడం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. సన్నిహిత వర్గాల కథనాల ప్రకారం.. మలైకా, హర్ష్ మెహతా తమ స్నేహం లేదా బంధాన్ని ప్రస్తుతం పూర్తిగా వ్యక్తిగతంగానే ఉంచాలని భావిస్తున్నారట. అయితే పాపరాజీ కెమెరాల నుంచి తప్పించుకోవడం సెలబ్రిటీలకు అంత సులభం కాకపోవడంతో, వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మలైకా అరోరా, హర్ష్ మెహతా డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నప్పటికీ, ఈ విషయంపై ఇద్దరిలో ఎవ్వరూ అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాలంటే వారి నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

