Polimera 3 | పొలిమేర 3 లో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా.. మైండ్ బ్లోయింగ్ అప్డేట్తో పెరిగిన అంచనాలు!
Polimera 3 | టాలీవుడ్లో హారర్, మిస్టరీ థ్రిల్లర్ జానర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘పొలిమేర’ ఫ్రాంచైజీ ఇప్పుడు మూడో భాగంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం ఓటీటీలో సంచలన విజయాన్ని నమోదు చేయగా, రెండో భాగం థియేటర్లలో భారీ వసూళ్లు సాధించి ఈ ఫ్రాంచైజీని మరో స్థాయికి తీసుకెళ్లింది.
Polimera 3 | టాలీవుడ్లో హారర్, మిస్టరీ థ్రిల్లర్ జానర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘పొలిమేర’ ఫ్రాంచైజీ ఇప్పుడు మూడో భాగంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం ఓటీటీలో సంచలన విజయాన్ని నమోదు చేయగా, రెండో భాగం థియేటర్లలో భారీ వసూళ్లు సాధించి ఈ ఫ్రాంచైజీని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు ‘పొలిమేర 3’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న వేళ, చిత్రబృందం ప్రకటించిన తాజా అప్డేట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మూడో భాగంలో సీనియర్ నటుడు, ‘యాక్షన్ కింగ్’ అర్జున్ సర్జా కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా “Action Meets Power” అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన ప్రత్యేక ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అర్జున్ ఎంట్రీతో ‘పొలిమేర 3’ కథ మరింత విస్తృతంగా, భారీ స్థాయిలో ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హారర్, మిస్టరీతో పాటు యాక్షన్ అంశాలు కూడా ఈసారి మరింత బలంగా ఉండనున్నాయనే చర్చ సాగుతోంది. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ‘మా ఊరి పొలిమేర’ ఎలాంటి అంచనాలు లేకుండా నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామీణ నేపథ్యంలో మంత్రతంత్రాలు, చేతబడులు, మూఢనమ్మకాల చుట్టూ తిరిగే కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ఈ సినిమాతో హాస్యనటుడు సత్యం రాజేష్ పూర్తి స్థాయి హీరోగా, నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఆయన నటన, కథలోని ట్విస్టులు, థ్రిల్లింగ్ అంశాలు సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
మొదటి భాగం విజయంతో ఉత్సాహంగా రెండో భాగాన్ని థియేటర్ల కోసం భారీ స్థాయిలో రూపొందించారు. ‘పొలిమేర 2’ విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. మిస్టరీ, హారర్, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.ఇప్పుడు మూడో భాగం గత రెండు చిత్రాల కంటే మరింత భారీ స్థాయిలో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘బ్లాస్ట్’ చిత్రంతో అర్జున్ సర్జా మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి విజయాన్ని అందుకుంది. యాక్షన్ సన్నివేశాల్లో అర్జున్ చూపించిన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను మెప్పించాయి.ఇలాంటి సమయంలో ఆయన ‘పొలిమేర 3’లో భాగం కావడం సినిమాకు మరింత బలం చేకూర్చే అంశంగా భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

