US Minister : అమెరికా (USA) ఆరోగ్య, మానవ సేవల మంత్రి (Health and Human service Secretary) రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ (Robert F Kennedy Jr) ఫ్లోరిడా (Florida) లోని ప్రముఖ డాక్టర్ ఓజ్ (Doctor Oz) ఇంటిపై రెండు బ్లాక్ రేసర్ జాతి సర్పాల (Black Racer Snakes) ను ఎలాంటి పరికరాలను ఉపయోగించకుండా ఉత్త చేతులతో పట్టుకున్నారు. వాటిని చేతుల్లోకి తీసుకుని కాసేపు ఆటాడారు. అయితే ఈ సందర్భంగా ఓ పాము కెన్నడీని కాటేసింది. అయినా ఆయన పాము కాటును పరిశీలించుకుంటూనే ఆటను కొనసాగించారు. అయితే ఈ బ్లాక్ రేసర్ పాములు విషపూరితం కాదు. అందుకే కెనడీ తనను పాము కాటేసినా పెద్దగా పట్టించుకోలేదు.
ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియోను కెనడీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ వన్యప్రాణులపై ఆసక్తిని చూపిస్తారు.గతంలో ఒకసారి ఆయన న్యూయార్క్ హైవే పక్కన చనిపోయి ఉన్న ఓ ‘రక్కూన్’ (వన్యప్రాణి) నుంచి ఓ శరీర భాగాన్ని వేరుచేసి తీసుకువెళ్లినట్లు తెలిపారు. అయితే దానిపై విమర్శలు రావడంతో ఆ శరీరభాగంపై పరిశోధనలు చేయడానికి దానిని తొలగించి తీసుకున్నట్లు వెల్లడించారు. కెన్నడీ పాములను పట్టిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
Cheryl cheerleads the removal of a pair of Black Racers from Dr Oz’s patio. pic.twitter.com/A0iiRzOeIF
— Robert F. Kennedy Jr (@RobertKennedyJr) May 26, 2026